కవిమాట: మిగిలే ఉండును ఒక ప్రశ్న?

by Disha edit |
కవిమాట: మిగిలే ఉండును ఒక ప్రశ్న?
X

నువ్వు ఉన్నదేమో

నడుమంత్రపు అనిశ్చల అగ్నిగోళం

రేయింబవల్ల గందరగోళం

ఒక ప్రక్కన భీకర సముద్ర ఘోషలు

ఒక ప్రక్కన చల్లని మంచు కొండలు

ఒక ప్రక్కన దహించే అగ్నిపర్వతాలు

ఒక ప్రక్కన పలకరించే పిల్లతెమ్మెరలు

ఒక ప్రక్కన చిమ్మ చీకట్లు

ఒక పక్కన కాల్చే ఎండలు

పైనుండి ఉరుములు మెరుపులు

పిడుగులవానలు వరద బీభత్సాలు

క్రింది నుండి

కబళించే పెను భూకంపాలు

కోరలేదు నువ్వు ఏ జన్మం

ఎందుకోయీ నీకు ఈ కర్మం

ప్రకృతికి తోడుగా

ఈ జన్మలు కల్పించెను ఆ బ్రహ్మ

పంచభూతాలే ఆహ్వానించి

నీలోన చైతన్యం నింపగా

సర్వ జీవులను కాపాడుకుంటూ

ప్రకృతి వనరుల పరిరక్షించుకుంటూ

పంచభూతాలకు గుడులు కట్టి

పూజించి ధన్యత పొందితివి!

జగమంతా నీ గుప్పిట్లో

విశ్వ రహస్యాల శోధన నెట్టింట్లో

త్రిశంకు స్వర్గం నిర్మించినా

తీరదోయీ నీ తృష్ణా

మిగిలే ఉండును ఒక ప్రశ్న?


పి.బక్కారెడ్డి

97053 15250


Also Read...

కవిత: అనుదినం..... ఆనందంగా



Next Story

Most Viewed