కవిమాట: దా (తా)గుడు మూతలు

by Disha edit |
కవిమాట: దా (తా)గుడు మూతలు
X

దాగుడుమూతలు దండాకోల్

పిల్లి వచ్చే ఎలుకా భద్రం

పదాల పొదల చాటున

ఇక సుతరాము కుక్కిన పేనులా పడి ఉండలేను

అక్షరాల అందం మాటున

విలక్షణంగా ఎదిగి మహదానందంగా ఒదిగిపోలేను

పోలికల మాటున

ఏలికలను ఇక పొగిడి గంగిరెద్దులా ఆడి పాడలేను

వాని విజిల్ పజిల్ కు

అనుకూలంగా మ్యూజికల్ ఛైయిర్ ఆట ఆడి ఓడలేను

ఒక్క స్మాల్ పెగ్గు కిక్కు తో

కిక్కురు మనకుండా ఇక నిశ్శబ్దంగా పడి ఉండలేను

ప్రాతివత్యం పేరున

గాంధారిలా బదిరాంధురాలిగా నటించలేను

ధృతరాష్ట్రుని ఉక్కు కౌగిలిలో

ఇమిడి ఇక పిండి పిండిగా మారను గాక ఏమారలేను


జూకంటి జగన్నాథం

94410 78095


Next Story