- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
తెల్లవారని రాత్రులన్నీ...
ఒకే ఒక్క కల "డాక్టర్ కావాలి..."
ప్రశ్నాపత్రం లీక్‌తో
లక్షల ఆశలు బూడిదయ్యాయి.
తల్లి కన్నీరు, తండ్రి నిట్టూర్పు
యువత ఆవేదనగా మారింది.
అందుకే జంతర్ మంతర్‌లో
న్యాయం కోసం అడుగులు పడ్డాయి.
చేతిలో ఆయుధం లేదు...
అక్షరాలే ఉన్నాయి.
గొంతులో ద్వేషం లేదు...
సత్యమే వినిపించింది.
కానీ సమాధానాల బదులు
లాఠీలు ఎదురయ్యాయి.
గాయపడింది శరీరమే...
ఓడిపోలేదు ఆత్మవిశ్వాసం.
అరెస్టులు అడుగులు ఆపొచ్చు...
ఆలోచనలను కాదు.
న్యాయం గెలిచే వరకు
యువశక్తి జ్వాల ఆరిపోదు.
-ముహమ్మద్ అజిజుద్దీన్
70131 76656
- Tags
- Poem
Next Story






