పిల్లలే కదా అనుకోకు..

by Ravi |   (  Updated:2026-07-27 00:00:44  IST  )

Poem

పిల్లలే కదా అనుకోకు..
X

పిల్లలే‌ కదా అనుకోకు

చిచ్చర పిడుగులు

నేలనూ, ఆకాశాన్ని

ఏకం‌ చేస్తారు

భూకంపాలను‌ సృష్టిస్తారు

వీధుల్లో సముద్రాలను పోటెత్తిస్తారు

పిల్లలే కదా అనుకోకు

ప్రజల జీవితాల్లోంచి

ఉద్భవించిన ఉద్యమ ఫిరంగులు

పీఠాలను పేల్చేస్తారు

నిజాల నిగ్గుతేల్చి

నియంతల‌ మెడలు వంచుతారు

నిర్మించుకున్న సామ్రాజ్యాలను

కూకటి వేర్లతో కూలదోస్తారు

పిల్లలే కదా అనుకోకు

నువ్వెన్ని‌ మాయోపాయాల

వలలు పన్నినా కొరికి పారేస్తారు

సింహం పిల్లలు పిల్లలే కదా అనుకోకు !

- చిత్తలూరి

91338 32246

Next Story