ఉచిత నీటి పథకం అమలుకు ఆధార్‌తో అనుసంధానం తప్పనిసరి 

by  |
miyapur
X

దిశ, మియాపూర్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గృహ వినియోగదారులు ప్రతి నెల 20వేల లీటర్ల ఉచిత నీటి పథకం అమలుకు డిసెంబర్ 31 లోపు ఆధార్‌తో అనుసంధానం చేసుకొని, ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మంగళవారం హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని శాంతినగర్‌లో ఆరెకపూడి గాంధీ , కార్పొరేటర్లు వి.జగదీశ్వర్ గౌడ్, రాగం నాగేందర్ యాదవ్ , హెచ్.ఎం.డబ్లు.ఎస్.ఎస్ అధికారులు జి.ఎం రాజేశ్వర్ , డి.జి.ఎం నాగప్రియలతో కలిసి ఉచిత మంచినీటి పథకంకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..డిసెంబర్ 31వ తేదీ లోపు ఆధార్ అనుసంధానం, మీటర్ ఏర్పాట్లు చేసుకుంటే ప్రజలకు 20వేల లీటర్ల వరకు 2020 డిసెంబర్ నుండి 31.12.2021 వరకు నీటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.లేదంటే లేట్ పేమెంట్ చార్జీలు విధించకుండా 2021సం. పూర్తి కాలానికి వాటర్ బోర్డు ద్వారా బిల్లులు జారీ చేయబడుతాయన్నారు. ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారికి మాత్రమే 20వేల లీటర్ల ఉచిత మంచినీటి పథకం వర్తిస్తుందని అన్నారు. కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed