అర్జున్ రెడ్డి ఫ్యాన్స్‌కి బిగ్ న్యూస్.. లైగర్ అప్‌డేట్ ఇదే..

by  |
liger
X

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా చేస్తున్న సినిమా ‘లైగర్’. మాస్ దర్శకుడు పూరిజగన్నాథ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో విజయ్ బాక్సర్‌గా దర్శనమియ్యనున్నాడు. అయితే ఇప్పటికే ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌కి బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌కి మధ్య ఫైట్ ఏ రేంజ్‌లో ఉంటుందా అని అందరూ ఊహిస్తున్నారు. కానీ మేకర్స్ మాత్రం ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందని ఇప్పటి వరకు చెప్పలేదు.

తాజాగా సినిమాకు సంబంధించి ఓ అప్‌డేట్ రానుందంటూ పూరీ ఓ ట్వీట్ చేశాడు. దాంతో సినిమా నుంచి ఏదైనా రిలీజ్ డేట్ వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే లైగర్ మేకర్స్ ఆడియన్స్‌కు డబుల్ ధమాకా ఇచ్చారు. సినిమా ఫస్ట్ గ్లింప్స్, రిలీజ్ డేట్‌లను ఫిక్స్ చేశారు. డిసెంబర్ 31న లైగర్ ఫస్ట్ గ్లింప్స్ రానుంది. ఇక సినిమా వచ్చే ఏడాది ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకి రానుంది. దీంతో రౌడీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.


Next Story

Most Viewed