యూట్యూబ్‌లో 'డిస్‌లైక్' చేస్తే సజెషన్స్ మారవు : అధ్యయనం

by Dishanational4 |
యూట్యూబ్‌లో డిస్‌లైక్ చేస్తే సజెషన్స్ మారవు : అధ్యయనం
X

దిశ, ఫీచర్స్ : మీ అభిరుచికి తగిన కంటెంట్‌ను చేరుకోవాలనే ఆశతో యూట్యూబ్‌లో 'Dislike, Not Interested' బటన్స్‌ను తరచుగా ఉపయోగించడం వల్ల సమయం వృథాచేసే అవకాశముందని కొత్త అధ్యయనం కనుగొంది. నిర్దిష్ట రకమైన కంటెంట్‌ను మళ్లీ చూడకూడదని ఈ బటన్స్ క్లిక్ చేయడం ద్వారా యూట్యూబ్‌కు తెలియజేసిన తర్వాత కూడా యూజర్ రికమెండేషన్స్ మారవని తెలుస్తోంది. 20,000కు పైగా యూట్యూబ్ యూజర్ల నుంచి సేకరించిన వీడియో రికమెండేషన్స్ డేటా ఉపయోగించి 'మొజిల్లా' ఈ కొత్త అధ్యయనాన్ని చేపట్టింది. ఈ మేరకు 'ఆసక్తి లేదు, అయిష్టం, చానెల్‌ను సిఫార్సు చేయడం ఆపివేయి, వాచ్ హిస్టరీ తీసివేయి' వంటి ఆప్షన్స్.. ఫ్యూచర్ రికమెండేషన్స్ నుంచి సారూప్య కంటెంట్‌ను తీసివేయడంలో చాలా అసమర్థంగా ఉన్నాయని గుర్తించింది.

అసందర్భ వీడియోలను ఎందుకు చూపుతోంది?

ఉత్తమ పనితీరు విషయంలో ఈ బటన్స్ పాత వీడియోల మాదిరిగానే సగానికి పైగా రికమెండేషన్స్‌ను హైడ్ చేయగలిగాయి. కానీ చెత్త పనితీరుకు సంబంధించి.. అనవసర కంటెంట్‌ను ఫిల్టర్ చేయడంలో ఈ బటన్స్ పనిచేయలేదు. ఇక మొజిల్లా పరిశోధకులు యూట్యూబ్ వీడియోల కోసం 'stop recommending' బటన్‌గా పనిచేసే బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్ 'RegretsReporter' అనే టూల్ ద్వారా యూజర్లతో పాటు రియల్ వీడియోల నుంచి డేటా సేకరించారు. ఈ డేటా 'తిరస్కరించబడిన', ఆ తర్వాత యూట్యూబ్ ద్వారా సిఫార్సు చేయబడిన మొత్తం 44,000 జతల వీడియోలను పరిశీలించారు. ఇవన్నీ 500 మిలియన్ రికమండెడ్ వీడియోల ద్వారా సేకరించిన డేటా నుంచి సృష్టించబడ్డాయి. ఆ తర్వాత సంబంధిత రికమెండేషన్స్ 'తిరస్కరించబడిన' వీడియోని పోలి ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు మెషిన్ లెర్నింగ్ ఉపయోగించారు.

ఈ మేరకు అసంబద్ధ రికమెండేషన్స్‌‌ను నియంత్రించడంలో 'Dislike, Not interested(వరుసగా 12%, 11%)' బటన్లు కొంతమేరకే ప్రభావవంతంగా ఉన్నాయి. అయితే 'చానెల్‌ను రికమెండ్ చేయొద్దు, హిస్టరీ నుంచి తొలగించు (43%, 29%)' మాత్రం మరింత ప్రభావవంతంగా పనిచేశాయి. ఇదిలా ఉంటే.. యూజర్లు తమ అనుభవం గురించి షేర్ చేసుకునే అభిప్రాయాలను యూట్యూబ్ గౌరవించాలని.. ఈ ప్లాట్‌ఫామ్‌లో వ్యక్తులు తమ సమయాన్ని ఎలా గడపాలనుకుంటున్నారనే విషయంలో వాటిని అర్థవంతమైన సంకేతాలుగా పరిగణించాలని పరిశోధకులు వెల్లడించారు.

Also Read: బేసిక్ ఇన్‌కమ్ ప్రోగ్రామ్.. ప్రతీ నిరాశ్రయుడికి రూ. 9.5 లక్షల సాయం


Next Story

Most Viewed