రాత్రిపూట చెట్ల ఆకులను ఎందుకు తెంపకూడదు.. దాని వెనుక కారణం ఏంటో తెలుసా..

by Disha Web Desk 20 |
రాత్రిపూట చెట్ల ఆకులను ఎందుకు తెంపకూడదు.. దాని వెనుక కారణం ఏంటో తెలుసా..
X

దిశ, ఫీచర్స్ : హిందూ మతంలో చెట్లను, మొక్కలను దైవ స్వరూపాలుగా పూజిస్తారు. అంతే కాదు మనుషులు, జంతువులకు ఉన్నట్టుగానే చెట్లకు, మొక్కలకు కూడా ప్రాణం ఉంటుందని చెబుతారు. అలాగే అవి కూడా రాత్రిపూట నిద్రించి, ఉదయాన్నే లేస్తాయని పూర్వీకులు చెప్పేవారు. అందుకే సాయంత్రం, రాత్రివేళల్లో చెట్లను మొక్కలను తాకడం, పువ్వులు, ఆకులు కోయడం నిషేధించారట. ఈ సంప్రదాయం కొన్ని ఏండ్ల నుంచి అమలులో ఉందని, ఇప్పటికీ దీన్ని అనుసరిస్తుంటారు. అయితే దీని వెనక మరిన్ని శాస్త్రీయమైన, మతపరమైన కారణాలు ఉన్నాయి. మరి అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

శాస్త్రీయ కారణాలు..

సాయంత్రం, రాత్రి వేళల్లో మొక్కలను, చెట్లను తాకి ఆకులు, పువ్వులు కోయడం శాస్త్రీయ దృక్కోణంలో తప్పుగా భావిస్తారు. ఎందుకంటే చెట్లు, మొక్కలు పగటి పూట ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. అలాగే రాత్రివేళల్లో ఆక్సిజన్‌కు బదులు కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తాయట. అందుకే చెట్లకి కిందికి రాత్రివేళ వెళ్లడం నిషేధించారు. అలా వెళ్లినట్లయితే ఆక్సిజన్ కొరత ఏర్పడుతుందని చెబుతారు.

మతపరమైన కారణాలు..

మనుషులు, జంతువుల లాగే మొక్కలు కూడా రాత్రిపూట నిద్రిస్తాయని చెబుతారు. నిద్రలో ఉన్నవారిని లేపితే ఎంత పాపమో చెట్లు, మొక్కలను రాత్రులు తట్టిలేపడం కూడా అంతే పాపం అంటున్నారు. అందుకే సాయంత్రం వేళ్లలో పువ్వులు, ఆకులు కోయడం నిషేధమని చెబుతున్నారు. అలాగే ఎన్నో జీవరాశులు పక్షులు, జంతువుతు, సూక్ష్మజీవులు, కీటకాలు రాత్రిపూట చెట్లు, మొక్కల పై నివసిస్తాయట. ఉదయం ఆహారం, నీళ్ల ఏర్పాటు కోసం వెళ్లి అలసిపోయి సాయంత్రం పూట విశాంత్రి తీసుకునేందుకు చెట్లపైన కట్టిన గూడులకు చేరతాయి. అందుకే రాత్రి సమయంలో మొక్కలు, చెట్లను తాకడం పువ్వులు, ఆకులను కోయడం వలన ఆ జీవుల నిద్రకు భంగం కలుగుతుందని చెబుతారు.



Next Story

Most Viewed