పద్మశ్రీ అందుకున్న ఉమా మహేశ్వరి, గోపీనాథ్‌, గడ్డం సమ్మయ్యలు ఎవరు ?

by Disha Web Desk 20 |
పద్మశ్రీ అందుకున్న ఉమా మహేశ్వరి, గోపీనాథ్‌, గడ్డం సమ్మయ్యలు ఎవరు ?
X

దిశ, ఫీచర్స్ : గణతంత్ర వేడుకల సందర్భంగా కేంద్రం ఈ ఏడాది 132 పద్శశ్రీ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఈ గౌరవాన్ని అందుకునేందుకు ఎంపికయ్యారు. కళారంగం నుంచి కథారచయిత ఉమా మహేశ్వరి, కృష్ణలీలా గాయకుడు గోపీనాథ్ స్వైన్, యక్షగాణ కళాకారుడు గడ్డం సమ్మయ్య పద్మశ్రీ అందుకున్నారు. అసలు వారు ఎవరు.. వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఉమా మహేశ్వరి ఎవరు ?

దేశంలోనే తొలి మహిళా హరికథా గాయని ఉమా మహేశ్వరి డి. ఆమె సంస్కృత పారాయణంలో ప్రావీణ్యం కలిగి ఉంది. ఆమె భైరవి, శుభపంతువరాలి, కేదారం, కళ్యాణితో సహా అనేక రాగాలలో కథలను చెబుతుంది. అంతే కాదు తెలుగు, సంస్కృతంలో ప్రావీణ్యం ఉన్న రచయిత. ఆడపిల్లలు సంప్రదాయ సంకెళ్లను దాటి కొత్తగా ఏదైనా చేయాలని నేర్పుతుంది. సంస్కృత భాషలో పఠించే ఉమ అనేక రాగాలలో కథలు చెబుతుంది. భైరవి, శుభపంతువరాలి, కేదారం, కళ్యాణి వంటి రాగాల్లో హరికథకు ప్రాచుర్యం కల్పించిన ఉమా మహేశ్వరి విలువైన కృషికి పద్మశ్రీ అవార్డు వరించింది.

గోపీనాథ్ స్వైన్, కృష్ణ లీలా గాయకుడు, ఒరిస్సా

గోపీనాథ్ స్వైన్‌ విశిష్ట సేవకు పద్మశ్రీ అవార్డు కూడా లభించింది. ఆయన గంజాంకి చెందిన కృష్ణ లీలా గాయకుడని, ఈ కళను సజీవంగా ఉంచడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన దఖింశ్రీ, చింతా, దేశాఖ్య, తోడి భటియారి, భటియారి, కుంభ కమోడితో సహా 5 పురాతన రాగాలను పాడడం మాత్రమే కాదు నేర్పించారు కూడా. పాఠశాలలను స్థాపించి తన కళను వందలాది మంది యువతకు నేర్పించారు. విశేషమేమిటంటే, అతను కేవలం 5 సంవత్సరాల వయస్సులో తన సంగీత సాధన ప్రారంభించాడు.

గడ్డం సమ్మయ్య

గడ్డం సమ్మయ్య 14 ఏండ్ల వయస్సులోనే కళారంగంలో అడుగుపెట్టారు. రంగస్థలంలో కృష్ణుని, కీచక పాత్రలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే కాదు బాలవద్ధి, సిరియాళుడు, సత్యహరిశ్చంద్రుడు, లోహితాన్యుడు, కంసుడు, రావణుడు, దుర్యోధనుని వేషధారణతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

అవార్డులు ఎందుకు ఇస్తారు?

ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటిస్తుంది. కళ, సామాజిక సేవ, వ్యాపారం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, ప్రజాసేవ వంటి వివిధ రంగాలలో విశేష కృషి చేసినందుకు ఈ అవార్డులు బహూకరిస్తారు.



Next Story

Most Viewed