'ట్రావెల్ నౌ.. పే లేటర్' ఆఫర్‌పై ఆసక్తి చూపిస్తున్న ఇండియన్స్!

by Disha Web Desk 7 |
ట్రావెల్ నౌ.. పే లేటర్ ఆఫర్‌పై ఆసక్తి చూపిస్తున్న ఇండియన్స్!
X

దిశ, ఫీచర్స్ : పర్యాటక రంగం.. ముఖ్యంగా విదేశీ పర్యాటకులపైనే ఆధారపడి ఉంటుంది. వారి నుంచే సింహభాగం ఆదాయం వస్తుంటుంది. అయితే మహమ్మారి కాలంలో స్వదేశీ, విదేశీ రాకపోకలన్నీ పూర్తిగా స్తంభించిపోవడంతో పర్యాటక దేశాలన్నీ అతలాకుతలం అయిపోయాయి. ఇప్పటికీ కొన్ని దేశాలు ఆంక్షల మధ్యలోనే టూరిస్ట్‌లను ఆహ్వానిస్తున్నా.. మరికొన్ని దేశాలు మాత్రం ప్రత్యేక ప్యాకేజీలు, ఆఫర్లతో రారమ్మంటు ఆహ్వానిస్తున్నాయి. ఇండియన్స్ కూడా పర్యటనలపై ఆసక్తి చూపిస్తుండగా.. బ్యాంకులు, ట్రావెల్ కంపెనీలు సహా థర్డ్-పార్టీ రుణదాతలు ప్రకటించిన కొత్త ఆఫర్ విదేశాలకు వెళ్లడం సహా, కొత్త పర్యాటక ప్రాంతాలను చూడటాన్ని సులభతరం చేసింది. ఈ సరికొత్త ఆఫర్ ఏంటంటే..

సాధారణంగా ఆన్‌లైన్ అంగళ్లు ఆయా ప్రొడక్ట్స్‌పై ఈఎమ్‌ఐ సౌకర్యాన్ని కల్పించడం లేదా ప్రస్తుతం వస్తువులు తీసుకోండి, ఆ తర్వాత చెల్లించండి అంటూ రకరకాల ఆఫర్స్‌తో వినియోగదారులను అట్రాక్ట్ చేస్తుంటాయి. ఇదే దారిని ఎంచుకున్న ట్రావెల్ కంపెనీలు, బ్యాంకులు భారతీయులకు కూడా 'ఇప్పుడు ప్రయాణించండి, తర్వాత చెల్లించండి' (BNPL) అనే ఆఫర్ అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా మంది భారతీయ పర్యాటకులు తమ విదేశీ ప్రయాణ ప్రణాళికలకు నిధుల కోసం ఈ ఆఫర్‌ను ఎంచుకుంటున్నారు. అంతేకాదు బీఎన్‌పీఎల్ ద్వారా EMIలలో చెల్లించే అవకాశం ఉండటంతో IT ఉద్యోగులు, హనీమూన్‌ కపుల్స్ దీనివైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. తమ కస్టమర్‌లలో 40% మంది అలాంటి రుణాలను ఎంచుకున్నారని అతిపెద్ద ట్రావెల్ ఆపరేటర్స్ పేర్కొనగా, ఇటువంటి ఎంపికలను కోరుకునే ప్రయాణికుల్లో 25% పెరుగుదల కనిపించిందని థామస్ కుక్ కంపెనీ వెల్లడించింది. ఈ క్రమంలోనే 2022 జనవరి - జూన్ మధ్య కాలంలో హనీమూన్ జంటలు సహా చిన్న కుటుంబాలలో ఈఎమ్‌ఐ రుణ సౌకర్యాలను ఎంచుకునే వారి సంఖ్య 30% పెరిగిందని చెన్నయ్‌కి చెందిన ట్రావెల్ కంపెనీ మధుర ట్రావెల్ స్పష్టం చేసింది.



Next Story

Most Viewed