ఇస్త్రీ చేసిన బట్టల పై ముడతలు కనిపిస్తున్నాయా.. ఇలా తొలగించండి..

by Disha Web Desk 20 |
ఇస్త్రీ చేసిన బట్టల పై ముడతలు కనిపిస్తున్నాయా.. ఇలా తొలగించండి..
X

దిశ, ఫీచర్స్ : ఏదైనా ఫంక్షన్లకు, పార్టీలకు, బయటికి వెళ్ళినప్పుడు నలిగిపోని, ఇస్త్రీ ఉన్న కొత్త బట్టలు వేసుకోవాలని చూస్తాం. ఉదయం వేసుకునే బట్టలను రాత్రిపూట ఇస్త్రీ చేసి పక్కన పెడతాం. కానీ ఉదయం లేచి చూసేసరికి మళ్లీ ముడతలు పడి ఉండడాన్ని గమనిస్తాం. ముఖ్యంగా ఆఫీసుకి వెళ్లేటప్పుడు బట్టల్లో ముడతలు కనిపిస్తే మూడ్ మొత్తం పాడైపోతుంది. మరి ఇస్త్రీ చేసిన బట్టలకు ముడతలు రాకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బట్టలు ఉతికేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి..

తేలికపాటి దుస్తులను బెడ్షీట్ వంటి బట్టలతో ఎప్పుడు కలిపి ఉతకకూడదు. అలా చేస్తే తేలికపాటి బట్టలు సులభంగా పాడవుతాయి. అలాగే కొన్ని బట్టలు ఉతికేటప్పుడు వాటి రంగు వదిలిపోతుంది. అలాంటి దుస్తులను మిగతా వాటితో కలిపి ఉతికితే అవి పాడవుతాయి. అలాగే మెషిన్‌లో దస్తులు వేసినప్పుడు అన్నిరకాల బట్టలను కలిపి వేయకూడదు. అలా చేస్తే బట్టలు పూర్తిగా ముడతలు పడిపోతాయి.

ఎండబెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి..

ఉతికిన తర్వాత బట్టలు ఆరవేసే సమయంలో ముడుచుకుపోయి ఉంటాయి. అలాంటి వాటిని నీడలో కాకుండా ఎండలో మాత్రమే ఆరబెట్టాలి. ఇలా చేయడం ద్వారా బట్టల పై ఉండే ముడతలను నివారిస్తుంది.

మెషిన్ నుండి బయటకు తీసిన వెంటనే బట్టలు ఆరబెట్టవద్దు. వాటిని బయటికి తీసి పూర్తిగా షేక్ చేసి, ఆపై వాటిని హ్యాంగర్ కు తగిలింగి ఆరేయాలి. ఒకవేళ తాడు పై బట్టలు ఆరేస్తే తాడు గుర్తులు బట్టల పై ఉంటాయి.

పొడిగా ఉన్న బట్టలన్నింటిని ఒకేచోట ఫోల్డ్ చేయకుండా పెట్టకూడదు. ఆరేసిన బట్టలను ఒక్కొక్కటిగా తీసి వెంటనే మడత పెట్టాలి. ఇలా చేయడం ద్వారా బట్టలు నీటిగా ఉండటం మాత్రమే కాకుండా పని భారాన్ని కూడా తగ్గిస్తుంది.

ఇస్త్రీ చేసేటప్పుడు బట్టల్లో ముడతలు కనిపిస్తే వెంటనే చేతులతో రుద్దాలి. అప్పటికీ ముడతలు తగ్గకపోతే బట్టల పై కొద్దిగా నీళ్లు చల్లి ఇస్త్రీ చేయాలి.



Next Story

Most Viewed