ప్రపంచంలో ఎక్కువ దొంగతనానికి గురి అయ్యేది ఇదేనంట!

by Disha Web Desk 8 |
ప్రపంచంలో ఎక్కువ దొంగతనానికి గురి అయ్యేది ఇదేనంట!
X

దిశ, ఫీచర్స్ : వస్తువులు దొంగతనం కావడం అనేది చాలా కామన్. ప్రపంచంలో ఎన్నో వస్తువులు మనకు తెలియకుండా దొంగతనం అవుతూనే ఉంటాయి. చిన్నప్పుడు మనం పాఠశాలలో ఉన్న సమయంలో బలపం, పెన్ను, పెన్సిల్ నుంచి పెద్దయ్యాక, మన పర్స్, వాలెట్స్ ఇలా ఎన్నో వస్తువులు దొంగతనానికి గురి అవుతాయి.

అయితే ప్రపంచంలో అత్యధికంగా ఒక వస్తువు దొంగతనానికి గురి అవుతుందంట. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల నుంచి పెద్దవారు ఎంతో ఇష్టంగా తినే చీజ్ అధికంగా దొంగతనానికి గురి అవుతుంది. దీనిని మన దేశంలో తక్కువగా తింటారు. కానీ పాశ్చాత్య దేశాల్లో దీని అమ్మకాలు చాలా ఎక్కువ. అయితే నెదర్లాండ్స్‌లోని ఓ షాపు నుంచి 17 లక్షల విలువ చేసే చీజ్‌ను దుండగులు లారీలతో వచ్చి ఎత్తుకెల్లారంట. అంతే కాకుండా ఇతర దేశాలలో కూడా ఇది ఎక్కువ దొంగతనం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీనికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. కొన్ని వందల కోట్ల రూపాయల మార్కెట్ చీజ్ మీదే నడుస్తోందంట. అంతే కాకుండా ఉత్పత్తి చేసిన దాంట్లో నాలుగు శాతం దోపిడికే గురి అవుతుందంటే, దీని డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా చేసిన ఓ సర్వేలో చీజ్ అత్యధిక దొంగతనానికి గురి కాగా, రెండో స్థానంలో మాంసం. మూడో స్థానంలో చాక్లెట్, నాలుగో స్థానంలో ఆల్కహాల్ ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

Next Story

Most Viewed