40 దేశాలు పర్యటించి.. అక్కడ స్థిరపడ్డ 'బిట్ కాయిన్ ఫ్యామిలీ'

by Web Desk |
40 దేశాలు పర్యటించి.. అక్కడ స్థిరపడ్డ బిట్ కాయిన్ ఫ్యామిలీ
X

దిశ, ఫీచర్స్ : పోర్చుగల్ దేశం క్రిప్టో కరెన్సీపై జీరో టాక్స్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం తమ లైఫ్‌స్టైల్‌కు అనుగుణంగా ఉండటంతో ఐదుగురు సభ్యులు గల ఓ డచ్ ఫ్యామిలీ ప్రస్తుతం ఆ దేశంలో స్థిరపడింది. గత ఐదేళ్లుగా 40 దేశాల్లో పర్యటించిన ఈ ఫ్యామిలీ.. చివరకు పోర్చుగల్‌ను తమ గమ్యస్థానంగా ఎంచుకుంది.

2017లో ప్రాపర్టీస్ మొత్తం విక్రయించి క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసిన డచ్ దేశస్థుడు తైహుట్టు భారీ లాభాలు ఆర్జించాడు. ఇదే క్రమంలో అనేక దేశాల్లో హార్డ్‌వేర్ వాలెట్స్ స్టోర్ చేయడంతో తన కోల్డ్ వాలెట్‌ను ఎక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకునే సౌలభ్యాన్ని కలిగి ఉన్నాడు. ఇదిలా ఉంటే.. బిట్‌కాయిన్ హెవెన్‌గా పేర్కొంటున్న పోర్చుగల్‌లో క్రిప్టోకరెన్సీ మూలధన లాభాలపై పన్ను లేదా ఇతరత్రా బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. కాగా డిజిటల్ కరెన్సీని సంపాదించినంత కాలం ఆ దేశంలో ఉండే క్రిప్టో యజమానులకు ఎటువంటి నష్టం లేకపోవడంతో తమ ఫ్యామిలీ ఇక్కడ స్థిరపడిందని తైహుట్టు పేర్కొన్నాడు.


దీంతో అతడి కుటుంబాన్ని 'బిట్‌కాయిన్ ఫ్యామిలీ'గా పిలుస్తున్నారు. ఇక 'క్రిప్టో'లో వారి ఆస్తుల విలువ గురించి తైహుట్టు కుటుంబం వెల్లడించనప్పటికీ.. అతను నాలుగు ఖండాల్లోని రహస్య వాల్ట్స్‌లో గణనీయ వాటానే కలిగి ఉన్నాడు. అంతేకాదు తైహుట్టు సోదరుడు, సోదరి కూడా తమ ఇళ్లను విక్రయించి, ఆ డబ్బును బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. ఇపుడు వారు కూడా పోర్చుగల్‌లో స్థిరపడేందుకు సిద్ధమయ్యారు.

పోర్చుగల్‌లో 'క్యాష్ అవుట్, క్రిప్టో-టు-క్రిప్టో ట్రేడ్‌' వంటి క్రిప్టో ట్రాన్సాక్షన్స్ ఫలితంగా పొందే మూలధన లాభాలు వ్యక్తిగత ఆదాయ పన్నులకు లోబడి ఉండవు. అందువల్ల ఇతర ఫియట్ కరెన్సీల మాదిరిగానే క్రిప్టోకరెన్సీ కొనుగోలు లేదా విక్రయం ద్వారా వచ్చే ప్రాఫిట్స్‌కు పన్ను, VAT విధించబడవు. ఇవన్నీ క్రిప్టో వినియోగదారులు నివసించేందుకు పోర్చుగల్‌ను ఆకర్షణీయమైన ప్రదేశంగా చేస్తున్నాయనడంలో సందేహం లేదు.


Next Story

Most Viewed