కొత్త ఇంధనాన్ని ఉపయోగిస్తున్న క్యాన్సర్ కణాలు : అధ్యయనం

by Disha Web Desk 9 |
కొత్త ఇంధనాన్ని ఉపయోగిస్తున్న క్యాన్సర్ కణాలు : అధ్యయనం
X

దిశ, ఫీచర్స్: యూనివర్శిటీ ఆఫ్ మిచిగాన్ రోజెల్ క్యాన్సర్ సెంటర్‌లోని పరిశోధకులు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కణాలు పెరగడానికి ఉపయోగించే కొత్త పోషక మూలాన్ని కనుగొన్నారు. ‘యురిడిన్’ అనే అణువు ఇంధన వనరుగా ఉపయోగపడుతుందని గుర్తించారు. కాగా ఈ పరిశోధన జీవరసాయన ప్రక్రియలు, సాధ్యమయ్యే చికిత్సా మార్గాలు రెండింటికి మార్గంగా ఉపయోగపడుతుంది.

ప్యాంక్రియాటిక్ కణితులు కొన్ని రక్త నాళాలను కలిగి ఉంటాయి. గ్లూకోజ్ వంటి రక్తం ప్రవాహం నుంచి వచ్చే పోషకాలను సులభంగా యాక్సెస్ చేయలేవు. దీంతో ఆకలితో ఉంటాయని వివరించారు పరిశోధకులు. అలాంటప్పుడు దేన్ని యాక్సెస్ చేస్తాయని పరిశీలించిన సైంటిస్టులు.. యురిడిన్ ఆ ఇంధనాలలో ఒకటి అని కనుగొన్నారు. ట్యూమర్ మైక్రో ఎన్విరాన్మెంట్లో దీన్ని గుర్తించిన వారు.. ఖచ్చితమైన మూలం ఏంటి? ఎక్కడి నుంచి వస్తుంది? క్యాన్సర్ కణాలు ఎలా యాక్సెస్ చేస్తాయి? అనేది ఇంకా రహస్యంగానే ఉంది.

దీనిలోని కొద్ది భాగం రక్త ప్రవాహంలో కనిపించింది కానీ ఎగ్జాక్ట్‌గా ఎక్కడి నుంచి వస్తుందనేది మాత్రం గుర్తించలేకపోయారు. యురిడిన్ ఫోషోరిలేస్-1 లేదా UPP1 అనే ఎంజైమ్ ద్వారా యురిడిన్ జీవక్రియ చేయబడుతుందని పరిశోధనలు చూపించాయి. UPP1ని నిరోధించడం ఎలుకలలో ప్యాంక్రియాటిక్ కణితుల పెరుగుదలపై ప్రధాన ప్రభావాన్ని చూపింది. యురిడిన్‌ను నిరోధించే మందులను కొత్త చికిత్సా ఎంపికలుగా తీసుకోవచ్చని సూచించింది.

కాగా పదేళ్లపాటు ఈ విషయంపై పనిచేసిన పరిశోధకులు.. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కణాలు పెరిగే వివిధ మార్గాలను అంచనా వేయడానికి 20 ప్యాంక్రియాటిక్ సెల్ లైన్స్, సుమారు 200 వేర్వేరు పోషకాలతో కూడిన పెద్ద ప్యానెల్‌ను ఉపయోగించినట్లు తెలిపారు. వాటి జీవక్రియ గురించి తెలుసుకునే పద్ధతి యురిడిన్‌ను కనుగొనటానికి దారితీసిందన్నారు.



Next Story

Most Viewed