శ్రీరామనవమి విశిష్టత.. ఈరోజే సీతారాముల కళ్యాణం ఎందుకు జరుపుతారంటే?

by Dishanational2 |
శ్రీరామనవమి విశిష్టత.. ఈరోజే సీతారాముల కళ్యాణం ఎందుకు జరుపుతారంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ : నేడు శ్రీరామ నవమి. హిందువులందరూ ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. భక్తి శ్రద్ధలతో శ్రీరామనుకి పూజలు చేసి, సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. కాగా, శ్రీరామనవమి విషిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. హిందూమత విశ్వాసాల ప్రకారం దశరథుడు, కౌసల్య దంపతులకు శ్రీరాముడు జన్మించాడు. త్రేతా యుగంలో చైత్ర శుద్ధ నవమి రోజున వసంత ఋతువు కాలంలో పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు పుట్టాడు. అందుకే ఈ పవిత్రమైన రోజున ప్రతి సంవత్సరం మన దేశంలో శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటారు. ఈరోజు హిందూ మతాన్ని విశ్వసించే వారందరూ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు.

ఆజానుబాహుడైన శ్రీరాముడికి - అందాల సీతమ్మకు ఈ రోజునే పెళ్లి జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణాన్ని ప్రతి రాముడి ఆలయంలోనూ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అంతేకాదు.. ఈ విశిష్టమైన రోజునే 14 సంవత్సరాల అరణ్యవాసం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడైనట్లు ప్రజల విశ్వాసం.

ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి మొదలు అంటే ఉగాది నుంచి శ్రీరామనవమి వరకూ శ్రీరామ కల్యాణ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఇక ఏదేవుడికైనా సూర్యోదయం కంటే ముందే పూజ చేస్తారు. కానీ శ్రీరాముల వారి కళ్యాణం మాత్రం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పూజ చేయాలి. పూజకు ముందే శ్రీ సీతారాముల విగ్రహాలతో లక్ష్మణుడు ఆంజనేయస్వామి విగ్రహాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ముందుగా పూల హారాలతో విగ్రహాలను అలంకరించుకోవాలి. భక్తి శ్రద్ధలతో పూజ జరిపించి, శ్రీ రామ రక్షా స్తోత్రం పఠించాలి.

ఇవి కూడా చదవండి: మీరు చనిపోయినప్పుడు ఏం జరుగుతుంది? ఇలా వెంటనే తెలుసుకోవచ్చు..



Next Story

Most Viewed