గుడ్ ఫ్రైడే ప్రత్యేకత.. ఈరోజు చేపలే ఎందుకు తింటారు?

by Disha Web Desk 9 |
గుడ్ ఫ్రైడే ప్రత్యేకత.. ఈరోజు చేపలే ఎందుకు తింటారు?
X

దిశ, ఫీచర్స్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రిస్టియన్లు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో గుడ్ ఫ్రైడే ఒకటి. క్రైస్తవులు దేవుడిగా ఆరాధించే ఏసుక్రీస్తును శిలువ వేసిన రోజే ఈ గుడ్‌ఫ్రైడే. ప్రజల రక్షణ కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడని చాలా మంది నమ్ముతారు. అందుకే ఈ రోజు అందరూ ఉపవాస దీక్షలు చేసి క్రీస్తును ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అయితే, దీనిని ఒక శుభకార్యంలా కాకుండా.. క్రీస్తు సంతాప దినంగా జరుపుకుంటారు. ఏసుకు శిలువ వేయబడిన మూడు రోజుల తర్వాత పునరుత్థానాన్ని ఆదివారం రోజు ఈస్టర్‌గా పాటిస్తారు.

మరోవైపు ఈ గుడ్ ఫ్రైడే రోజు క్రైస్తవులు చేపలు తినడం సాంప్రదాయంగా వస్తోంది. చికెన్, మటన్ కాకుండా చేపలను తినే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. ఆ మాంసాలకు ఇది ప్రత్యామ్నాయంగా భావిస్తారు. చేపలు తినే సాంప్రదాయానికి కొన్ని లోతైన చారిత్రక మూలాలు ఉన్నాయి. పురాతన కాలంలో చేపలు... తీర ప్రాంత ప్రజలకు ప్రధాన ఆహారంగా ఉండేవి. క్రైస్తవ మతం యూరోప్ అంతటా వ్యాపించడంతో తీరప్రాంతాల్లో ఉండే వారికి గుడ్ ఫ్రైడే రోజు చేపలు వినియోగం ఖచ్చితంగా మారింది. ఇతర మాంసాలను తినడం వల్ల పర్యావరణ క్షీణత ఎక్కువవుతుంది. అందుకే సముద్రపు ఆహారాన్ని ఎంచుకుంటారు. ఈ క్రమంలోనే చేపలు తినడం అలవాటుగా మారింది.


Next Story