డబ్బు లెక్కించే సమయంలో అస్సలే ఈ తప్పులు చేయకూడదంట?

by Dishanational2 |
డబ్బు లెక్కించే సమయంలో అస్సలే ఈ తప్పులు చేయకూడదంట?
X

దిశ, వెబ్‌డెస్క్ : లక్ష్మీ దేవిని కొలిస్తే సంపద పెరుగుతుంది అంటారు. ఏ ఇంట్లో అయినా సరే లక్ష్మీదేవిని శుక్రవారం నిష్టగా పూజిస్తారు. అయితే ఇంట్లో డబ్బులను లెక్కించే సమయంలో కొన్ని నియమాలు పాటించాలంట.లేకపోతే ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందంట. అంతే కాకుండా చేతిలో డబ్బు పోవడం, అతిగా ఖర్చు అవ్వడం లాంటివి జరుగతాయి. అందువలన డబ్బులను లెక్కించే సమయంలో ఎలాంటి తప్పులు చేయకూడదో చూద్దాం.

ఎవరైనా యాజకులకు, పేదలకు డబ్బులు దానం చేసే క్రమమంలో అస్సలే డబ్బులను విసిరి వేయకూడదంట. దీని వలన ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉందంట. అలాగే కొందరు డబ్బులను లెక్కబెట్టే సమయంలో చేతి వేళ్లను పదే పదే నోట్లో పెట్టుకుంటూ లెక్కిస్తారు. ఇది కూడా చాలా పెద్ద తప్పు అంటున్నారు పండితులు, దీని వలన లక్ష్మీ దేవికి కోపం వస్తుందంట. అందువలన నీటితో లెక్కించడం మంచిది.

అలాగే పర్స్‌లో కరెన్సీ నోట్లు, నాణేలతో పాటు ఎలాంటి ఆహార పదార్థాలను ఉంచకూడదు. కొందరు చాక్లెట్స్, సోంపు వంటి పెడుతుంటారు. కానీ ఇలా చేయడం వల్ల డబ్బుకు అవమానం జరుగుతుందట. అలాంటప్పుడు లక్ష్మీదేవికి కోపం వస్తుందట.

Read more:

ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడుతున్నారా?.. హెయిర్ లాస్ ప్రాబ్లం రావచ్చు



Next Story

Most Viewed