నాసా 'వెబ్స్' ద్వారా అతి చిన్న ఉల్కను గుర్తించిన సైంటిస్టులు

by Dishanational4 |
నాసా వెబ్స్ ద్వారా అతి చిన్న ఉల్కను గుర్తించిన సైంటిస్టులు
X

దిశ, ఫీచర్స్: గ్రహ శకలాల పూర్తిస్థాయి ఉనికిని, అవి ఏ గ్రహం నుంచి వెలువడుతున్నాయో తెలుసుకునే పరిశోధనలో భాగంగా ప్రధాన లక్ష్యం చేరుకోనప్పటికీ.. డేటాను విశ్లేషించే క్రమంలో కొత్త గ్రహ శకలం(ఉల్క)ను తమ నాసా వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా అందిన ఛాయా చిత్రం ఆధారంగా గుర్తించినట్లు సైంటిస్టులు తెలిపారు. ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా రోమ్ కొలోసియం సైజులో ఈ ఉల్క ఉన్నట్లు తెలుస్తోంది. నాసా వెబ్ స్పేస్ టెలిస్కోప్ చరిత్రలో సైంటిస్టులు కనుగొన్న విశ్వంలోని అతి చిన్న వస్తువు ఇదే అయి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

గగన తలంలోని ఉల్కలు లేదా శకలాల అప్ డేట్స్‌ను సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేసింది నాసా. పరిశోధకులు సుమారు 100 నుంచి 200 మీటర్ల పొడవుగల ఒక గ్రహ శకలానికి సంబంధించిన ఫొటోను క్యాప్చర్ చేశారు. 'వెబ్ మిడ్-ఇన్‌ఫ్రారెడ్ ఇన్‌స్ట్రుమెంట్‌'ను ఉపయోగించి యూరోపియన్ ఖగోళ శాస్త్రవేత్తలు దీనిని కనుగొన్నారు. వంద మిలియన్ కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండే, 100 మీటర్ల వస్తువును గుర్తించే సామర్థ్యాన్ని నాసా వెబ్ టెలిస్కోప్ స్పేస్ కలిగి ఉంది.

తాజాగా మునుపెన్నడూ లేని విధంగా ఎంఐఆర్ఐ సామర్థ్యం ద్వారా కనుగొన్న ఉల్కను స్టడీ చేస్తున్నట్లు జర్మనీలోని 'మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎక్స్‌ట్రాటెరెస్ట్రియల్ ఫిజిక్స్‌' ఖగోళ శాస్త్రవేత్త థామస్ ముల్లర్ తెలిపారు. తాము వివిధ ఉపగ్రహాలు, గ్రహ శకలాల విషయంలో చేస్తున్న పరిశోధనల్లో ఇంకా ప్రధాన లక్ష్యం సాధించలేకయినప్పటికీ డేటాను విశ్లేషించడం ద్వారా చాలా అంశాలు తెలుసుకున్నామని, ఒక నూతన ఉల్కను గుర్తించామని చెప్పారు. కొన్ని సందర్భాల్లో వైఫల్యాలు కూడా కొన్ని ప్రయోజనాలు కలిగిస్తుంటాయని పేర్కొన్నారు. తాజాగా ఉల్కను కనుగొనడాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు. అంగారక గ్రహం, జూపిటర్‌ల మధ్య ప్రధాన ఉల్క బెల్ట్‌లో నాసా వెబ్ టెలిస్కోప్ ఆధారంగా వివిధ గ్రహ శకలాల ఉనికిని ఖగోళ శాస్త్రవేత్తలు 1998లో తొలిసారిగా కనుగొన్నారు.

గ్రహశకలాల కచ్చితమైన స్థానం?

కొత్తగా గుర్తించిన గ్రహశకలం స్వభావాన్ని, దాని లక్షణాలను మెరుగ్గా అంచనా వేయడానికి మరిన్ని పరిశోధనలు అవసరం అని ప్రీమియర్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది. ఇప్పటి వరకూ పరిశోధకులు 1.1 మిలియన్లకు పైగా గ్రహశకలాల కచ్చితమైన స్థానాన్ని గుర్తించగలిగినట్టు తెలిపారు. అయితే వెబ్‌ టెలిస్కోప్ ద్వారా క్యాప్చర్ అయిన కొత్త గ్రహశకలంలాగే ఇంకా తెలియనివి ఎన్నో ఉండవచ్చని చెప్తున్నారు. వెబ్ ఇన్‌ఫ్రారెడ్ టెలిస్కోప్ అనేది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనది. మిగిలిన వాటి స్థానాన్ని కనుగొనడంలో ఇది సహాయపడుతుందనే ఆశాభావం వ్యక్తం అవుతోంది.


పేషెంట్ డీఎన్‌ఏ ఆధారంగానే మందులు ఇవ్వాలి.. లేదంటే సైడ్ ఎఫెక్ట్స్


Next Story

Most Viewed