మెదడులో ఆందోళనను తగ్గించే జన్యువును కనుగొన్న సైంటిస్టులు

by Disha Web Desk 10 |
మెదడులో ఆందోళనను తగ్గించే జన్యువును కనుగొన్న సైంటిస్టులు
X

దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సాధారణ సమస్యల్లో యాంగ్జైటీ డిజార్డర్ ఒకటి. ప్రతీ నలుగురిలో ఒకరికి వారి జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా ఇది వచ్చిపోయే అవకాశం ఉంటుందని అధ్యయనాలు చెప్తున్నాయి. మానసిక బాధలు మెదడుకు సంబంధించిన అమిగ్డాలాలోని(amygdala) న్యూరాన్లలో జెనెటిక్, బయోకెమికల్, పదనిర్మాణ(morphological) మార్పులకు కారణమవుతాయి. స్ట్రెస్ ప్రేరేపిత ఆందోళన ద్వారా ప్రభావితమైన ఈ ప్రాంతం, తీవ్ర భయాందోళనలు, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వంటి రుగ్మతలకు దారితీస్తుంది. అయితే యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ అండ్ ఎక్సెటర్ పరిశోధకులు తాజా అధ్యయనంలో భాగంగా బ్రెయిన్‌లో ఇటువంటి ఆందోళన కలిగించే భావాలకు కారణమయ్యే జన్యువును కనుగొన్నారు. ఇది ఆల్టరేషన్ ఆందోళన స్థాయిలను తగ్గిస్తుంది. యాంగ్జైటీ డిజార్డర్స్‌కు కొత్త చికిత్సలకు మార్గం చూపుతుంది.

యాంటి యాంగ్జైటీ డ్రగ్స్ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నప్పటికీ వాటి సమర్థత తక్కువగా ఉంది. పేషెంట్లలో సగం కంటే ఎక్కువ మంది ట్రీట్‌మెంట్ తర్వాత ఉపశమనం పొందలేని పరిస్థితులు ఉంటున్నాయి. లిమిటెడ్ సక్సెస్ అనేది ఒత్తిడికి సంబంధించిన మాలెక్యూలర్(molecular) సంఘటనలకు కారణం అవుతోంది. అంతర్లీనంగా ఉన్న న్యూరల్ సర్క్యూట్‌లపై అవగాహన లేకపోవడం వంటి స్ట్రెస్ రిలేటెడ్ సమస్యలతో ఇది ముడిపడి ఉంటుంది. కానీ తాజా అధ్యయనం మెదడులోని ఆందోళనకు సంబంధించిన పరమాణు సంఘటనలను గుర్తించడమే లక్ష్యంగా పెట్టుకుంది. జంతు నమూనాలలో miRNAలుగా పిలువబడే అణువులపై దృష్టి కేంద్రీకరించింది. ఈ సమూహం మానవ మెదడులో కూడా కనుగొనబడింది. అమిగ్డాలాలోని సెల్యులార్ ప్రక్రియలను నియంత్రించే అనేక ప్రోటీన్లను నియంత్రిస్తుంది.

ఆందోళనకర పరిస్థితి సందర్భంలో miR483-5p అనే ఒక రకమైన అణువు. Pgap2 అనే మరొక జన్యువు యొక్క వ్యక్తీకరణను అణిచివేస్తుందని సైంటిస్టులు పేర్కొన్నారు. ఇది మెదడులోని న్యూరానల్ పదనిర్మాణ శాస్త్రంలో(neuronal morphology) మార్పులను, ఆందోళనతో సంబంధం ఉన్న ప్రవర్తనను నడిపిస్తుంది. అందువల్ల దాని నుంచి ఉపశమనాన్ని ప్రోత్సహించడానికి ఒత్తిడి-ప్రేరిత (stress-induced ) అమిగ్డాలా మార్పులను సమతుల్యం చేసే మాలిక్యులర్ బ్రేక్‌గా miR-483-5p పనిచేస్తుందని అధ్యయన కర్తలు తెలిపారు. యాంగ్జైటీ డిజార్డర్స్‌కు అత్యంత అవసరమైన చికిత్సల ఆవిష్కరణకు ఇది మొదటి మెట్టు అని, యాంటీ-యాంగ్జైటీ థెరపీల అభివృద్ధికి ఉపయోగపడుతుందని నిపుణులు చెప్తున్నారు.

Also Read..

జుట్టుకు నూనె రాసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే


Next Story