Scientific Reason: విగ్రహాలు ఎందుకు పెరుగుతాయో తెలుసా? దీని గురించి సైన్స్ చెప్పే నిజాలేంటి?

by Disha Web Desk 10 |
Scientific Reason: విగ్రహాలు ఎందుకు పెరుగుతాయో తెలుసా? దీని గురించి సైన్స్ చెప్పే నిజాలేంటి?
X

దిశ, వెబ్ డెస్క్ : కరీంనగర్ జిల్లాలో కమలాపూర్లో వరాహ స్వామి విగ్రహం ఒకటి ఏడాదికొక సెంటి మీటరు చొప్పున పెరుగుతుందట. అది దేవుడు మహిమ అని అందరు చెప్పుకుంటున్నారు. కానీ ఈ విషయం పై సైన్స్ ఏమి చెబుతుందో.. ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం. ఈ భూగోళం యొక్క వ్యాసార్థం 6,378 కిమీ. అందులో పై భాగం 68 కిలో మీటర్ల మందం గల గట్టిగా.. పెంకులాగా లోపలి భాగం 6 వేల సెంటిగ్రేడ్ వేడితో కరుగుతున్న లావా అనబడే చిక్కటి ద్రవ పదార్ధంతో నిండి ఉంటుంది. పై భాగమైన గట్టి రాతి పదార్ధం అనేక పొరలుగా ఉంటుంది. అవి నిరంతం కదులుతుంటాయి. ఆ కదిలే పొరలు ఒక దానికొకటి ఢీ కొని ఉన్న ఒక్కసారి విడిపోయిన భూగంపాలు లేక లోయలు ఏర్పడవచ్చు.అలా కాకుండా ఒక పోర మీద మరొక పొర నెమ్మదిగా ఎక్కితే పైనున్న టెక్టానిక్ పొర పైకి లేచి భూమిని చీల్చుకొని పైకి వస్తుంది. క్రమంగా భూమి మీద పెరుగుతున్న రాయి లాగా కనిపిస్తుంది. కొన్ని ఏళ్లకు ఆ రాళ్ల సముదాయం ఒక గుట్ట లాగా కనిపిస్తాయి. కొన్ని లక్షల ఏళ్లకు ఆ రాళ్లు పర్వతాలుగా పెరుగుతాయి. ఇలా పెరుగుతున్న విగ్రహాలన్నీ ఒక పీఠం మీద ప్రతిష్టించినవి కాకుండా.. భూమి లోని రాళ్లుగా మలచబడినవే.

ఇవి కూడా చదవండి : మంగళ సూత్రం విషయంలో మహిళలు ఈ తప్పులు అస్సలు చేయకూడదు..!

Next Story