కిడ్నీలను దెబ్బతీస్తున్న హై బ్లడ్ ప్రెషర్.. జెనెటిక్ మ్యుటేషన్ లేకపోవడమే రీజన్

by Disha Web Desk 6 |
కిడ్నీలను దెబ్బతీస్తున్న హై బ్లడ్ ప్రెషర్.. జెనెటిక్ మ్యుటేషన్ లేకపోవడమే రీజన్
X

దిశ, ఫీచర్స్: హై బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా గుండె జబ్బులతో ముడిపడి ఉంటుందని మనకు తెలుసు. కానీ ఇది కిడ్నీలను కూడా డ్యామేజ్ చేస్తుందని ఒక అధ్యయనం పేర్కొన్నది. ముఖ్యంగా మూత్ర పిండాలను నిరంతరం రక్షించే PDE3A జన్యు ఉత్పరివర్తనను(gene mutation) కలిగి‌లేని వ్యక్తుల్లో ఈ పరిస్థితి తలెత్తుతుందని మాక్స్ డెల్‌బ్రక్ సెంటర్ అండ్ DZHKకి చెందిన పరిశోధకుడు ఎన్నో క్లూస్‌మాన్ (Enno Klussmann) నేతృత్వంలోని సైంటిస్టుల బృందం వెల్లడించింది. దీనికి సంబంధించిన పరిశోధనా వివరాలు ‘కిడ్నీ ఇంటర్నేషనల్’లో పబ్లిష్ అయ్యాయి.

అధిక రక్తపోటు, షార్ట్ ఫింగర్స్‌కు(hypertension and brachydactyly, or HTNB) కారణమయ్యే జన్యు పరివర్తన, ముఖ్యంగా రక్తపోటు-ప్రేరిత నష్టం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఏటా 10 నుంచి 20 కుటుంబాలు ప్రభావితం అవుతున్నాయి. ఈ కుటుంబాల్లో చిన్న వయస్సు కలిగినవారు కూడా మృత్యువాత పడుతున్నారని పరిశోధకులు అంటున్నారు. కాబట్టి PDE3A జన్యు ఉత్పరివర్తన అవకాశం లేకుండా, హై బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లం ఉన్న పిల్లలకు దానిని నియంత్రించే ట్రీట్మెంట్ అవసరం అవుతుందని నిపుణులు చెప్తున్నారు.

Also Read... కరోనా తర్వాత మగశిశువులే ఎక్కువ పుడుతున్నారు.. ఎందుకంటే?



Next Story

Most Viewed