ఇండియాలో మొబైల్ గేమింగ్‌‌కు ఊపు.. ఇన్వెస్ట్‌మెంట్ పెంచిన కంపెనీలు

by Disha Web Desk 6 |
ఇండియాలో మొబైల్ గేమింగ్‌‌కు ఊపు.. ఇన్వెస్ట్‌మెంట్ పెంచిన కంపెనీలు
X

దిశ, ఫీచర్స్ : ఇండియాలో మొబైల్ గేమింగ్‌కు ఊహించని ఆదరణ దక్కుతోంది. దీంతో ఎక్కువ మంది ప్రేక్షకుల అటెన్షన్‌ క్యాచ్ చేయడంతో పాటు వారిని గేమ్స్‌లో ఎంగేజ్ చేసేందుకు గాను మొబైల్ గేమింగ్ కంపెనీలు ఆరాటపడుతున్నాయి. ఈ క్రమంలోనే మొబైల్ గేమింగ్ ప్రకటనల కోసం గతేడాది ప్రతి నాలుగు బ్రాండ్స్‌లో మూడు తమ ఇన్వెస్ట్‌మెంట్‌ను గణనీయంగా పెంచుకున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. 75 శాతం బ్రాండ్స్ ఏడాది కంటే ఎక్కువ కాలం నుంచి మొబైల్ గేమ్ యాప్స్‌లో ప్రకటనలు చేస్తుండగా.. పాండమిక్ నుంచే సంబంధిత ఖర్చుల్లో రెండు రెట్ల పెరుగుదలకు దారితీసిందని తెలుస్తోంది.

InMobi 'మొబైల్ గేమ్ అడ్వర్టైజింగ్ 2022' నివేదిక ప్రకారం.. మొబైల్ గేమింగ్ ఎన్విరాన్‌మెంట్స్‌పై ప్రకటనలు చేసే 97 శాతం మంది విక్రయదారులు ఫలితాలతో సంతృప్తి చెందినట్లు చెప్పడంతో మొబైల్ గేమింగ్ ప్రకటనలకు సంబంధించిన ఖర్చులు(ఏడాదికి) 2 రెట్లు పెరిగాయి. 'ఆడియన్స్ రీచ్ పెరుగుతుండటం, ప్రకటన ఫార్మాట్స్‌లో వైవిధ్యం, యాడ్ బడ్జెట్స్‌లో పెరుగుదల నమోదవుతున్నందున మొబైల్ గేమ్ ప్రకటనలు ఒక ట్రెండ్‌గా మారుతున్నాయి' అని InMobi ఆసియా పసిఫిక్ మేనేజింగ్ డైరెక్టర్ రిషి బేడి అన్నారు. సానుకూల ఫలితాల కారణంగా ఎక్కువ మంది ప్రకటనదారులు తమ మీడియా మిక్స్‌లో మొబైల్ గేమ్ ప్రకటనలను చేర్చుకుంటున్నారని ఆయన తెలిపారు.

నివేదిక ప్రకారం, ప్రకటనకర్తల సగటు వ్యయంలో గేమింగ్.. 32 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. ఇంటర్నెట్, మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(IAMAI) అందించిన తాజా డేటా ప్రకారం, భారతదేశం 430 మిలియన్‌కు పైగా మొబైల్ గేమర్స్‌కు నిలయంగా ఉంది. 2025 నాటికి ఈ సంఖ్య 650 మిలియన్‌కు పెరుగుతుందని అంచనా. ఇక భారతీయ గేమింగ్ మార్కెట్ 2025 నాటికి $3.9 బిలియన్ విలువకు చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నందున, హార్డ్‌కోర్ మొబైల్ గేమర్స్‌లో 40 శాతం మంది తమ గేమ్స్ కోసం సగటున నెలకు రూ. 230 ఖర్చు చేస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి: 'ఫ్లైట్ మోడ్' పరేషాన్?


Next Story

Most Viewed