శిలలపై శిల్పాలు చెక్కుతున్న రోబో

by Disha Web Desk 10 |
శిలలపై శిల్పాలు చెక్కుతున్న రోబో
X

దిశ, ఫీచర్స్ : ప్రముఖ ఇటాలియన్ శిల్పి మైఖేలాంజెలో చెక్కిన శిల్పాలతో మీ ఇంటిని అలంకరించాలని అనుకున్నారా? అయితే ఆ సమయం వచ్చినట్లే ఉంది. అదేంటి 1564లోనే కన్నుమూసిన ఆయన ఇప్పుడెలా శిల్పాలు చెక్కగలరు అనే సందేహం వచ్చింది కదా. అవును.. ఆయన స్వయంగా కాకుండా మైఖేలాంజెలో మాదిరిగానే పాలరాతి శిల్పాలను చెక్కే రోబోను కనిపెట్టింది ఇటలీకి చెందిన రోబోటర్ అనే స్టార్టప్. ఈ రోబో శిల్పి అచ్చం మైఖేలాంజెలో మాదిరిగానే శిల్పాలు చెక్కుతుండగా.. సోషల్ మీడియాలో వైరల్ అయింది.

'1L' పేరుతో పిలుస్తున్న రోబో.. 13 అడుగుల ఎత్తులో ఉంది. ఇది జింక్ అల్లాయ్ రోబో. కాగా ఆశ్చర్యకరమైన ఫలితాలను అందించడానికి పాలరాయిని జాగ్రత్తగా చిప్ చేయగలదు. 'మనం శిల్పకళ కొత్త యుగంలోకి ప్రవేశిస్తున్నాము. ఇది ఇకపై విరిగిన రాళ్ళు, ఉలి, ధూళిని కలిగి ఉండదు. కానీ స్కానింగ్, పాయింట్ క్లౌడ్స్, డిజైన్‌ను కలిగి ఉంటుంది. తవ్విన పదార్థం ఇప్పుడు తీవ్రమైన పరిస్థితుల్లో కూడా.. ఊహించలేని విధంగా అన్‌ఇమాజినబుల్‌గా మార్చబడుతుంది' అని రోబోటర్ ట్విట్టర్‌ ద్వారా తెలిపింది.

ఈ టెక్నాలజీ లెజెండరీగా అనిపించినప్పటికీ.. శిల్పకళా నైపుణ్యాన్ని మెరుగుపర్చడానికి తమ జీవితమంతా గడిపిన కళాకారులు సంతోషించరని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ప్రముఖ ఆర్టిస్టులు. ఒక పురాతన కళ అయిన శిల్పకళకు ఖచ్చితమైన అభ్యాసం అవసరం. శిల్పం పూర్తిగా యంత్రాల ద్వారా చేస్తే.. చేతితో చేసే ఈ గొప్ప కళ శాశ్వతంగా కనుమరుగైపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : ఐడీతో మాయ చేయలేరు.. ముఖం చూసి వయసు చెప్పేస్తున్న టెక్నాలజీ

Next Story

Most Viewed