ఉక్రెయిన్ నుంచి భారత్‌కు వస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్.. వాటికి పర్మిషన్

by Web Desk |
ఉక్రెయిన్ నుంచి భారత్‌కు వస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్.. వాటికి పర్మిషన్
X

దిశ, ఫీచర్స్ : ఉక్రెయిన్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో స్వదేశానికి తిరిగొస్తున్న భారతీయ విద్యార్థులు, ఉద్యోగులకు భారత ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉక్రెయిన్ విడిచి వెళ్లిపోతున్న ప్రజలు తమ పెంపుడు జంతువులు లేకుండా వెళ్ళేందుకు నిరాకరిస్తున్నందున తమ పెట్ యానిమల్స్‌ను వెంట తెచ్చుకునేందుకు అంగీకరించింది. వన్-టైమ్ రిలాక్సేషన్ కింద నిబంధనలు సులభతరం చేసినట్లు ఫిషరీస్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన మెమోరాండంలో పేర్కొంది.

ఉక్రెయిన్ నుంచి ఇండియన్స్‌ను స్వదేశానికి తరలిస్తున్న క్రమంలో రిషబ్ కౌశిక్ అనే విద్యార్థి తన కుక్కపిల్ల లేకుండా ఇండియాకు వచ్చేందుకు నిరాకరించడం వైరల్‌గా మారింది. తను లేకపోతే పెట్ డాగ్ ఒంటరైపోతుందన్న అతడి స్టోరీ ఆలోచింపజేసింది. ఇదే క్రమంలో మరికొందరు తమ పెట్స్‌ను భారతదేశంలోకి అనుమతించమని రెస్‌క్యూ ఎవ్రీ డిస్ట్రెస్డ్ ఇండియన్ ఓవర్సీస్ (REDIO) అనే NGOని సంప్రదించారు. ఇక సోషల్ మీడియాలోనూ ఇందుకు సంబంధించిన విజ్ఞప్తులు వెల్లువెత్తడంతో పెటా ఇండియా.. ఈ విషయంపై ఫిషరీస్, యానిమల్ హజ్బెండరీ మినిస్టర్ పర్షోత్తమ్ రూపాలాను సంప్రదించగా మంత్రిత్వ శాఖ నిబంధనల సడలింపు చర్యలకు ఆదేశించింది.

ఈ చర్యల్లో భాగంగా పెట్ యానిమల్స్ ఇంపోర్ట్‌కు ముందు, తర్వాత నిబంధనలు సడలించబడతాయి. ఈ మేరకు ఉక్రెయిన్ నుంచి వచ్చిన అన్ని మూగజీవాల సమాచారాన్ని పశుసంవర్ధక శాఖ, కేంద్ర ప్రభుత్వ పాడిపరిశ్రమతో పంచుకునేందుకు సంబంధిత రాష్ట్రాల పశువైద్య అధికారులతో సమన్వయం చేసుకోవాల్సిందిగా అన్ని యానిమల్ క్వారంటైన్ అండ్ సర్టిఫికేషన్ సర్వీసెస్‌కు సంబంధించిన ప్రాంతీయ పశువైద్యులను ఆదేశించారు. ఇక ఈ నిర్ణయంతో జంతువుల ప్రవేశాన్ని క్రమబద్ధీకరించిన 'హంగేరి, పోలాండ్, రొమేనియా, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్‌, లిథువేనియా' దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది.



Next Story

Most Viewed