మీ చర్మంపై ఈ లక్షణాలు ఉంటే.. మీ శరీరంలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నట్లే?

by Disha Web Desk 10 |
మీ చర్మంపై  ఈ లక్షణాలు ఉంటే..  మీ శరీరంలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నట్లే?
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా మధుమేహ సమస్య వివిధ ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా గుండె జబ్బులు మరియు నరాల దెబ్బతినడం వంటి మధుమేహం యొక్క సాధారణ సమస్యలు వస్తాయని మనకి తెలుసు. మీ చర్మంపై ఈ లక్షణాలు ఉంటే.. మీ శరీరంలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నట్లే. ఆ లక్షణాలు ఏంటో ఇక్కడ చూద్దాం..

డయాబెటిక్ డెర్మోపతి

డయాబెటిక్ డెర్మోపతి సమస్య ఉన్న వారికీ లేత గోధుమరంగు లేదా ఎరుపు, పొలుసుల మచ్చలు, ఎక్కువగా దవడలపై కనిపిస్తుంది. ఇది చర్మం కింద ఉండే చిన్న రక్తనాళాల్లో మార్పుల వల్ల వస్తుంది. ఇది చర్మం ఆకృతి మరియు పిగ్మెంటేషన్‌లో మార్పులకు దారితీస్తుంది.

ఇన్ఫెక్షన్ మరియు దురద

మధుమేహ సమస్య ఉన్న వారిలో ఇమ్యునో డిఫిషియెన్సీ కారణంగా చర్మ ఇన్ఫెక్షన్లకు గురవుతారు. సాధారణ అంటువ్యాధులు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, స్టెఫిలోకాకల్ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. దురద వల్ల చర్మాన్ని గోకడం వల్ల పుండ్లు ఏర్పడతాయి, దీని వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.

Read More: రాత్రి పూట ఇలా చేస్తే.. మలబద్దకం దూరం!


Next Story