మీది ఎలక్ట్రికల్ కారు అయితే... వర్షకాలంలో తస్మాత్ జాగ్రత్త

by Disha Web Desk 1 |
మీది ఎలక్ట్రికల్ కారు అయితే... వర్షకాలంలో తస్మాత్ జాగ్రత్త
X

దిశ, వెబ్ డెస్క్ : వర్షాకాలం కారు యజమానులకు తెగ చిరాకును తెప్పిస్తుంది. ఆకస్మిక వర్షాలతో ఎల్లప్పుడు రోడ్లపై నీరు నిలిచి ఉంటుంది. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో బేస్ మెంట్, పార్కింగ్ వంటి ప్రాంతాల్లో నీరు నిలవడం వల్ల వాహనాలు పూర్తి దెబ్బతినే అవకాశం ఉంది. ఈ మధ్య ప్రధాన నగరాల్లో ప్రెట్రోల్, డిజిల్ కార్ల వినియోగం తగ్గి ఎలక్ట్రికల్ వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో వర్షం పడితే చాలు ఆ కార్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రికల్ కార్లను వర్షాలు, వరదల బారి నుంచి ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మొదటిది ఎలక్ట్రికల్ వాహనాలను చార్జ్ చేసేందుకు వినియోగించే పరికరాలను సురక్షితంగా ఉంచుకోవాలి. చార్జింగ్ స్టేషన్ ఆరుబయట ఏర్పాటు చేసినట్లయితే అది వర్షానికి షాట్ సర్క్యూట్ కు దారి తీసే అవకాశం ఉంది. అందుకే చార్జింగ్ స్టేషన్ ను లోపలి భాగంలో వర్షానికి తడవకుండా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. రెండోది ఎకక్ట్రికల్ కారుకు అతి ముఖ్యమైనది బ్యాటరీ హెల్త్. ఇంజన్ నుంచి బ్యాటరీకి వెళ్లే కనెక్షన్ ఇన్సులేషన్ లేదా కనెక్టర్ సరిగ్గా ఉందో లేదా అప్పుడప్పుడు పరిశీలించాలి. ఏదైనా డ్యామేజ్ గుర్తిస్తే వెంటనే సర్వీస్ సెంటర్ ను సంప్రదించాలి.

అదేవిధంగా కారు ఇంటీరియర్ ను కూడా రెగ్యూలర్ గా తనిఖీ చేయాలి. ఏవైనా లీకేజీలు ఉన్నాయా.. అన్ని సక్రమంగా పని చేస్తున్నాయా అని విషయాన్ని గమనించాలి. వానా కాలంలో ఎలక్ట్రికల్ కారులో ప్రయాణిస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే అది మనకు తీవ్ర నష్టాన్ని మిగుల్చుతుంది. ముఖ్యంగా నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రయాణించడం వల్ల కారులోని ఎలక్ట్రానిక్స్, సెన్సార్‌ లు దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. వీటన్నింటి క్రమం తప్పకుండా పాటిస్తే మీ కారు సేఫ్ గా ఉంటుంది.

Read More: విపరీతంగా గురక పెడుతున్నారా... మానాలంటే ఇలా చేయండి

అదిరిపోయే ఫీచర్స్‌తో Hop OXO ఈవీబైక్.. పెట్రోలు ఖర్చు అంతతో ఈఎమ్ఐ కట్టొచ్చు!



Next Story

Most Viewed