నేల రహిత పంటలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..

by Disha Web Desk 8 |
నేల రహిత పంటలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం చాలా మంది అనేక అనారోగ్య సమస్యల వలన బాధపడుతున్నారు. ముఖ్యంగా ఉప్పు అధికంగా తీసుకోవడం వలన రక్తపోటు, కిడ్నీ , థైరాయిడ్ లాంటి సమస్యలు వస్తున్నాయి. దీంతో వైద్యులు అయోడిన్ తక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసకోవాలని సూచిస్తున్నారు. ప్రజలు కూడా కొన్ని పోషకాలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.కొంత మంది అసలు అయోడిన్ మొత్తానికే తీసుకోవడం లేదు. కానీ అయోడిన్ పూర్తిగా తీసుకోకపోవడం కూడా అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. ఈ క్రమంలో దక్షిణ ఇటలీలోని కమర్షియల్ మైక్రోగ్రీన్ ఫామ్‌లో పనిచేస్తున్న పరిశోధకులు ఓ కొత్త ప్రయోగానికి నాంది పలికారు. వారు అయోడిన్, పొటాషియం సరిపడా ఉండే కూరగాయలు పండించగలిగారు.

అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తుల కోసం దక్షిణ ఇటలీలోని కమర్షియల్ మైక్రోగ్రీన్ ఫామ్‌లో పని చేస్తున్న పరిశోధకులు అయోడిన్, పొటాషియం సరిపడ ఉండే ముల్లంగి,బఠానీ, అరుగూలా, స్విస్ చార్డ్ కూరలను పండించారు. సాధారణంగా ఏ కూరగాయలైనా సరే నేల మీద పండుతాయి.కానీ పరిశోధకులు మంచిపోషకాలు ఉన్న కూరగాయలు పండించడానికి నేల రహిత సాగు, పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతిగా వారు తెలిపారు. మట్టిలేకుండా పండిన కూరగాయల్లో పోషక ద్రావణం సరిగ్గా ఉందని వారు పేర్కొన్నారు. అలాగే కొన్ని పరిశోధనల తర్వాత ప్రత్యేక ఫార్ములలో పెంచని మొక్కల్లో 14శాతం అధిక అయోడిన్ ఉన్నట్లు వారు గుర్తించారు.

అయోడిన్ సరైన థైరాయిడ్ ఆరోగ్యానికి కీలకమైన పోషకం. ఇది ఉప్పు, పాలు, చేపలు , గుడ్లలో ఎక్కువగా ఉంటుంది. అయితే ఆరోగ్య సంస్థలు ఉప్పు తీసుకోవడం తగ్గించాలని, చెప్పడంతో చాలా మంది శాఖాహారం వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఇక ఇదే తరహాలో, శాస్త్రవేత్తలు పొటాషియంలో 45% తగ్గింపుతో అదే కూరగాయలను పండించగలిగారు.అధిక పొటాషియం అనేది మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నవారిని సమస్యల్లోకి నెట్టేస్తుంటది. ఎక్కువ పొటాషియం ఉన్న కూరగాయలను తీసుకోవడం ద్వారా మూత్రపిండాల పనితీరు బలహీనంగా ఉంటుంది. దీంతో వైద్యులు వారిని పొటాషియం ఎక్కువగా ఉన్న కూరగాయలు తినకూడదు అంటారు. ఈ క్రమంలో ఆధునాతన పద్ధతులు ఉపయోగించి పొటాషియం తక్కువగా ఉండే కూరగాయలను శాస్త్రవేత్తలు పండించారు. వారు మాట్లాడుతూ నేలరహిత పద్ధతి ద్వారా పొటాషియం, అయోడిన్ సరిపడ ఉండే కూరగాయలను పండిచడం గొప్ప ఆసక్తిని కలిగించిందని పేర్కొన్నారు.



Next Story

Most Viewed