పెళ్లైన మహిళకు త్వరగా వచ్చేస్తున్న హైబీపీ.. సర్వేలో షాకింగ్ విషయాలు వెళ్లడి!

by Disha Web Desk 8 |
పెళ్లైన మహిళకు త్వరగా వచ్చేస్తున్న హైబీపీ.. సర్వేలో షాకింగ్ విషయాలు వెళ్లడి!
X

దిశ, ఫీచర్స్ : పెళ్లైన మహిళల ఆరోగ్యంపై జరిగిన ఓ అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెళ్లడి అయ్యాయి. పెళ్లి కానీ మహిళలతో పోలిస్తే, పెళ్లైన మహిళల్లో హైబీపీ త్వరగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నదంట.

అయితే అమెరికాకు చెందిన పరిశోధకులు 10000 మందికి పైగా జంటలను తీసుకొని, దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఓ సర్వే చేశారు. పెళ్లికాని, పెళ్లైన వారి, బరువు, శారీరక శ్రమ, అల్కహాల్, గుండె స్పందన రేటు ఇలా చాలా విషయాలను బట్టి వారిని పరిశీలించారు. ఈ పరిశోధనలో పెళ్లి కాని మహిళలకంటే పెళ్లైన వారిలో త్వరగా హైబీపీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నదని తేలినట్లు సమాచారం. అయితే ఒక వేళ భర్తకు అధిక రక్తపోటు లేదా హైబీపీ ఉంటే అది భార్యకు కూడా వచ్చే అవకాశం 19 శాతం ఎక్కువ అని జర్నల్ ఆఫ్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పరిశోధకులు తెలిపారు.

భార్యభర్తలు మనుషులు వేరైనా మనుసులు ఒకటే? ఇద్దరి అభిరుచులు, జీవన విధానం ఒకే విధంగా ఉంటడం వలన వారి ఆరోగ్య ఫలితాలు ఒకే లాఉంటున్నాయంట. అయితే ఈ రక్తపోటు 50 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న జంటల్లో 35 శాతం వస్తున్నట్లు సర్వే తెలిపింది.

అధిక రక్తపోటు అంటే ?

హైబీపీ లేదా అధిక రక్తపోటు అనేది శరీరంలోని ధమనులను ప్రభావితం చేసే ఒక ఆరోగ్య పరిస్థితి. ఇది గుండెను ఇబ్బందుల్లోకి నెట్టుతుంది. దీనికి చికిత్స తీసుకోకపోతే గుండెపోటు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.



Next Story

Most Viewed