గుడ్ ఫ్రైడే స్పెషల్.. ఐదు రొట్టెలు, రెండు చేపల అసలు కథ ఇదే!

by Disha Web Desk 9 |
గుడ్ ఫ్రైడే స్పెషల్.. ఐదు రొట్టెలు, రెండు చేపల అసలు కథ ఇదే!
X

దిశ, ఫీచర్స్: గుడ్ ఫ్రైడే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. క్రిస్టియన్లకు ఉన్న అతిముఖ్యమైన రోజుల్లో ఇది ఒకటి. క్రైస్తవ మత విశ్వాసం ప్రకారం యేసుక్రీస్తు శుక్రవారం శిలువపై ప్రాణాలు అర్పించిన రోజుగా పరిగణిస్తారు. యూరప్ దేశాల్లో ఈ పండుగను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని చర్చీల్లోనూ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏసు చనిపోయిన రోజు కాబట్టి దీనిని కేవలం ప్రత్యేక రోజున కాకుండా.. సంతాప దినంగా కూడా భావిస్తారు. కాగా ఈ రోజున క్రిస్టియన్లంతా చేపలు, రొట్టెలు తింటారు.

దీనికి ఒక కారణం ఉంది. ‘ఒక రోజు ఏసు కలెలూయా సముద్రం దాటి వెళ్లాడు. ప్రజలకు దూరంగా వెళ్లి ఏకాంతంగా గడపాలని నిర్ణయించుకున్నాడు. కానీ, జనాలు ఆయన్ను వెంబడించాయి. ఆయనతోనే ఉండాలని ప్రజలు కోరుకున్నారు. ఈ క్రమంలోనే అడవిలోనే దాదాపు 5 వేల మంది ప్రజలకు బోధనలు చెప్పారు. మధ్యలో భోజన సమయం అవుతుంది. చుట్టు పక్కల ఎంత వెతికినా తినడానికి ఏం దొరకలేదు. ఈ సందర్భంలో ఆయన వెంట వచ్చిన ప్రజల్లోని ఓ చిన్న పిల్లవాడి వద్ద ఐదు రొట్టెలు, రెండు చేపలు ఉంటాయి.

వాటిని చూసిన ఏసు శిష్యులు ఇవి అందరికీ సరిపోవు అని చెప్పారు. ముందు మీరు ఆ రొట్టెలు, చేపలను అందరికీ పంచండి అని ఆదేశిస్తారు. ఈ క్రమంలో అందరికీ పంచారు. మొత్తం అక్కడున్న 5 వేల మంది తిన్నా కూడా అవి అయిపోలేదు. దీంతో ఆ రోజు అక్కడున్న ప్రజలు ఏసు చేసిన అద్భుతాన్ని కళ్లారా చూశారు. ఆరోజు అందరూ ఏసును ఆదర్శంగా తీసుకున్నారు’ అందుకే ప్రతి గుడ్ ఫ్రైడే రోజున ఐడు రొట్టెలు, రెండు చేపలను పంచడంతో పాటు తినడం ప్రారంభించారు.


Next Story