పక్కచూపులు చూస్తున్న మ్యారీడ్ పీపుల్స్.. అసలు రీజన్ అదేనట!

by Disha Web Desk 10 |
పక్కచూపులు చూస్తున్న మ్యారీడ్ పీపుల్స్.. అసలు రీజన్ అదేనట!
X

దిశ, ఫీచర్స్ : ఇండియాలో పెళ్లిళ్లు పవిత్రమైనవిగా పరిగణిస్తారు. ప్రతి ఒక్కరూ వివాహ వేడుకలను ఉన్నంతలో ఘనంగా, సంతోషంగా జరుపుకుంటారు. అయితే ఈ బంధాలు అందరి జీవితాల్లో ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాయని చెప్పలేం. కొందరి జీవితంలో సమస్యలు, అసంతృప్తి, కష్టాలు వంటివి కూడా ఉంటున్నాయి. ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు(extramarital affairs) పలువురి జీవితాల్లో సమస్యలకు కారణం అవుతున్నాయి. నిబద్ధత కలిగిన భాగస్వాములు కూడా వివిధ కారణాలవల్ల(interrelated reasons) తమ జీవితంలో వివాహేతర సంబంధాలను ఎక్కువగా కోరుకుంటున్నారని IPSOS సహకారంతో గ్లీడెన్ సంస్థ నిర్వహించిన ఒక సర్వే రిపోర్టు వెల్లడించింది.

ఫిజికల్ అట్రాక్షన్, ఎమోషనల్ సపోర్ట్

పార్టనర్స్ మధ్య నమ్మక ద్రోహానికి, మనస్ఫర్థలకు ఇద్దరిలో ఒకరికి ఇతర వ్యక్తిపై ఫిజికల్ అట్రాక్షన్ కామన్ రీజన్‌గా ఉంటోంది. ఈ మోజులో పడినవారు తమ భాగస్వాములను మోసం చేస్తున్నారని గ్లీడెన్ సర్వే పేర్కొన్నది. దీని ప్రకారం.. 26 శాతం వరకు ప్రైవేట్ ఈవెంట్స్, వివిధ పార్టీలే కొందరి జీవితంలో వివాహేతర సంబంధానికి వేదికలుగా మారుతున్నాయి. ఇక సోషల్ మీడియా 25 శాతం, డేటింగ్ యాప్స్ 19 శాతం పెళ్లైనవారు తమ భార్య లేదా భర్తకు తెలియకుండా వివాహేతర సంబంధాలు కొనసాగించడానికి కారణం అవుతున్నాయి. దీంతోపాటు పార్టనర్ తరచూ నిర్లక్ష్యం చేయడం, శ్రద్ధ కనబర్చకపోవడం, అవమానించడం, నిందించడం, ఎటుంటి పరిస్థితుల్లోనూ ప్రశంసించకపోవడం, ప్రేమించకపోవడం, సెక్స్‌లో పాల్గొనకపోవడం వివాహేతర సంబంధాలకు దారితీస్తున్నాయి. రిలేషన్‌షిప్‌లో కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం, ఎమోషనల్ సపోర్టు లేకపోవడం కూడా కారణం అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో జీవితంలో ఒక్కసారైనా భాగస్వామిని మోసం చేసినవారు 57 శాతం మంది ఉన్నట్లు సర్వే వెల్లడించింది. ఆశ్చర్యం ఏంటంటే.. పెళ్లైన మొదటి సంవత్సరంలోనే 45 శాతం మంది భాగస్వాములు ఇతరులతో శారీరక సంబంధం పెట్టుకోవడానికి ఆస్తకి చూపుతున్నట్లు సర్వే రిపోర్టు హైలెట్ చేసింది.

రొమాన్స్‌పై పెరుగుతున్న ఇంట్రెస్ట్

కొందరు పార్టనర్స్ తమ భర్త లేదా భార్యకంటే ఇతరులతో ఎక్కువగా ఫీలింగ్స్ షేర్ చేసుకునే క్రమంలో ఇద్దరి భావాలు (common interests) కలవడంవల్ల మరింత కనెక్ట్ అవుతున్నారు. ఇది శారీరక సంబంధానికి కారణం అవుతోంది. 44 శాతం మంది వ్యక్తులు ఒకే సమయంలో ఇద్దరు వ్యక్తులతో ప్రేమలో ఉండవచ్చని అభిప్రాయపడినట్లు సర్వే పేర్కొన్నది. వివాహేతర సంబంధానికి భావోద్వేగ అవిశ్వాసం ఒక సాధారణ మార్గంగా ఉంటోంది. ఇక ఈరోజుల్లో చాలామంది ఏకభార్యత్వం(Monogamy) లేదా కేవలం పెళ్లి చేసుకున్న పార్టనర్‌తో మాత్రమే లైంగిక సంబంధం కలిగి ఉండటం లేదు. కొత్తగా ట్రై చేయాలని, గొప్ప థ్రిల్ అనుభవించాలని, ఇతర మహిళలతో సెక్స్ చేయాలని తహ తహలాడే మగవారు ఎక్కువమందే ఉంటున్నారని గ్లీడెన్ సర్వే హైలెట్ చేసింది. స్ర్తీలలో కూడా కొందరు ఇలాంటి రొమాంటిక్ ఫీలింగ్స్ కలిగి ఉంటున్నారు. ఇటువంటి భావాలతో 37 శాతం మంది తమ భాగస్వామికి తెలియకుండా లేదా మోసం చేయడం ద్వారా ఎక్స్‌ట్రా మారిటల్ ఎఫైర్స్ కలిగి ఉంటున్నారు.

లైంగిక సంతృప్తి లేకపోవడం

లైంగిక అసంతృప్తి అనేది పార్టనర్‌పై అవిశ్వాసం లేదా నమ్మక ద్రోహానికి ముఖ్యమైన డ్రైవర్‌గా ఉంటోంది. 41 శాతం మంది క్రమం తప్పకుండా సెక్స్‌లో పాల్గొంటున్నప్పటికీ తమ భాగస్వామితో సంతృప్తి చెందడం లేదని గ్లిడెన్ సర్వే స్పష్టం చేసింది. అలాగే 55 శాతం మంది తమ భాగస్వాములతో కాకుండా ఇతరులతో సన్నిహితంగా ఉండాలని, సెక్స్ కోరికలు తీసుకోవాలని భావిస్తున్నారట. వ్యక్తులు తమ రిలేషన్‌షిప్‌లో లైంగికంగా సంతృప్తి చెందకపోవడంతో ఇతరులతో శారీరక సాన్నిహిత్యాన్ని కోరుకోవడం సాధారణంగా మారిపోయింది. ఇక మరికొందరు ‘అదర్ మోటివేషన్స్’‌తో ప్రేరణ పొంది తాము ఇష్టపడే వ్యక్తితో ఫిజికల్ కాంటాక్ట్ ఏర్పర్చుకుంటున్నారు. ఇంకొందరు తమ భాగస్వామి నమ్మకద్రోహం చేసినప్పుడు ప్రతీకారం తీర్చుకునే ఆలోచనతో వీరు కూడా ఎక్స్ ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ పెట్టుకోవాలని, కోరికలు తీర్చుకోవాలని భావిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది.

Next Story

Most Viewed