ఆడపిల్లలకు ఇలాంటి పేర్లు అస్సలు పెట్టకూడదు.. ఎందుకంటే?

by Disha Web Desk 10 |
ఆడపిల్లలకు ఇలాంటి పేర్లు అస్సలు పెట్టకూడదు.. ఎందుకంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : ఎట్టి పరిస్థితుల్లో కొన్ని పేర్లు మన పిల్లలకు అస్సలు పెట్టకూడదు. పిల్లల పేర్లు అనేవి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొని ఉంటాయి. పిల్లలకు పెట్టేటటువంటి పేర్లు వారి యొక్క జీవితంలో ప్రభావాన్ని చూపిస్తాయి.మనం పెట్టేటటువంటి పేరే వారి యొక్క జీవితం మంచి దశ లోకి వెళ్లలన్నా వారి జీవితంలో గొప్ప గొప్ప మార్పులు జరిగి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలన్న వారికి ఎంతగానో సహాయపడుతుంది. పేరుకు ఉన్నటటువంటి ప్రాముఖ్యతను గుర్తించి అటువంటి మంచి పేర్లను మాత్రమే పిల్లలకు పెట్టాల్సిన అవసరం ఉంది.

పుట్టబోయే పిల్లలకు ఏ పేరు పెట్టాలనేది కడుపులో ఉన్నప్పటి నుంచి తల్లిదండ్రి ఆలోచిస్తుంటారు. వీటికి అంతటి ప్రాముఖ్యత ఉంది. హిందూ శాస్త్ర ప్రకారం 16 మృత కర్మలను పాటించాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైనది నామకరణం నామకరణం , అందుకే పుట్టిన పిల్లలకు నామకరణం చేయడం ఆనవాయితీగా ఇస్తుంది. కొంతమంది వారికి ఇష్టమైన వ్యక్తుల పేర్లు కలిసేటట్టు తాతలు పేర్లు పెట్టుకుంటారు. హిందూ శాస్త్ర ప్రకారం పేర్లు పెట్టేటప్పుడు గ్రహాలు, తిధులు చూడాల్సి ఉంటుంది. జన్మ జాతకం ప్రకారం రాశిని నిర్ణయించుకున్న తర్వాత పేరును పెట్టాల్సి ఉంటుంది. అష్టమి , అమావాస్య, చతుర్దశి తిధుల్లో పిల్లలకు పేర్లు అస్సలు పెట్టకూడదు. చతుర్థి తిధి , నవమి తిధి ఇలాంటి తిధుల్లో కూడా పిల్లలకు పేర్లు పెట్టడం అశుభంగా భావిస్తారు.ఆడపిల్లలకు ఇలాంటి పేర్లు అస్సలు పెట్టకూడదని జ్యోతిష్య నిపుణులు వెల్లడించారు. ద్రౌపది.. ఈమె మహా పతివ్రత, అలాగే పంచ పాండవులకు భార్య, ఐదుగురు భర్తలకు భార్య కావడంతో హిందువులు ఈ పేరు పెట్టడానికి ఇష్ట పడరు. మండోదరి, రావణుడు భార్య కావడంతో ఈమె పేరు కూడా ఎవరు పెట్టుకోరు. మందర,ఈమె చెడు కోరుకునే మనిషి..కైకేయికి లేని పోనీ మాటలు చెప్పి రాముడు అడవులకు వెళ్ల డానికి కారణ భూతం అయింది. అందుకే ఈమె యొక్క పేరును ఆడ పిల్లలకు పెట్టకూడదు.

Read More: పచ్చిపాలతో వీటిని తగ్గించుకోవచ్చని తెలుసా?



Next Story

Most Viewed