నెయ్యితో అన్ని రకాల చర్మ సమస్యలకు చెక్.. ఇలా ట్రై చేయండి..

by Disha Web Desk 7 |
నెయ్యితో అన్ని రకాల చర్మ సమస్యలకు చెక్.. ఇలా ట్రై చేయండి..
X

దిశ, ఫీచర్స్: మారుతున్న నేటి కాలంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా చర్మ సమస్యలు వెంటాడుతున్నాయి. నిత్యం ఉపయోగించే కెమికల్ కాస్మటిక్స్, వాతావరణ పరిస్థితులు చర్మ సంరక్షణకు పెద్ద సవాలుగా మారాయి. దీంతో చిన్న వయసులో పెద్దవారిలా కనిపించడం, 30 సంవత్సరాల లోపే ముఖంపై ముడతలు రావడం, స్క్రీన్ టైమ్ పెరగడం కారణంగా కంటి చుట్టూ నల్లటి వలయాలు రావడం పెద్ద సమస్యగా మారాయి. వీటికోసం ట్రీట్మెంట్, క్రీమ్స్ అంటూ వేలకు వేలు డబ్బులు వృథా చేసుకుంటున్నారు. కానీ రసాయనాలతో చేసిన ఉత్పత్తుల కంటే సహజమైన పద్ధతిలో కొబ్బరి నూనె, పాలు, నెయ్యి వంటి ప్రకృతి వరప్రసాదంతో చర్మాన్ని కాపాడుకోవచ్చని, బోలెడు ప్రయోజనాలు కలిగిస్తాయని చెప్తున్నారు నిపుణులు.

1. డార్క్ సర్కిల్స్: (కంటి చుట్టూ నల్లటి మచ్చలు)

చాలా మందికి నిద్రలేమి కారణంగా కంటి మీద ఏర్పడే డార్క్ సర్కిల్స్ పెద్ద సమస్యగా మారాయి. ఎంత రెడీ అయినా కూడా లుక్ మాత్రం దరిద్రంగా ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. రోజు పడుకునే ముందు కంటి చుట్టూ నెయ్యిని అప్లయ్ చేసి, చేతి వేళ్లతో మర్దన చేసుకోవాలి. దీని వల్ల అక్కడి చర్మం కాంతివంతంగా మారుతుంది. రిలాక్సింగ్ అనుభూతిని పొందుతుంది. ఇలా వారం రోజుల పాటు చేస్తే డార్క్ సర్కిల్స్ పూర్తిగా తగ్గిపోతాయి.

2. హైడ్రేటెడ్ స్కిన్: ( పొడి చర్మం)

నెయ్యిలో విటమిన్ ఎ, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. రాత్రి పూట ముఖానికి కొద్దిగా నెయ్యి రాసి మరుస‌టి రోజు ఉద‌యాన్నే క‌డిగేయడం వల్ల. ముఖం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. ముఖంపై ఉండే మ‌చ్చలు, మొటిమ‌లు పోతాయి. ఇది మీ చర్మానికి నేచురల్ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఎక్కువ సమయం పాటు చర్మాన్ని తేమగా ఉంచి, పొడి చర్మాన్ని నిరోధిస్తుంది.

3. పగిలిన పెదాలు కోసం:

నెయ్యి.. పొడి, పగిలిన పెదవులకు చెక్ పెడుతుంది. ఇందుకోసం మీరు పగిలిన పెదాలకు రోజు పడుకునే ముందు లేదా డ్రై అయినప్పుడు.. లిప్ బామ్‌కు బదులుగా నెయ్యిని అప్లయ్ చేయాలి. దీంతో మీ పెదవులు ఫ్రెష్‌గా కనిపిస్తాయి. మృదువుగా మారతాయి.

4. యాంటీ ఏజింగ్:

ప్రస్తుత జీవన శైలిలో చాలా మార్పులు వచ్చాయి. అతి తక్కువ వయసులోనే చర్మంపై ముడతలు రావడం, చిన్న వయసులోనే పెద్దవారిలా కనిపించడం లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు నెయ్యితో చెక్ పెట్టవచ్చు. ఇందుకుగాను అర టేబుల్ స్పూన్ నెయ్యిలో తేనె క‌లిపి ముఖానికి రాయాలి. 18-20 నిమిషాలపాటు ఉంచి త‌రువాత గోరు వెచ్చని నీటితో క‌డిగేయాలి. ముఖంపై ఏర్పడే ముడ‌త‌లు, మ‌చ్చల‌కు ఈ చిట్కా అద్భుతంగా ప‌నిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ డి, యాంటీఆక్సిడెంట్లు చర్మంపై ముడతలు తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి

5. కాలిన గాయాలు, పుండ్లు :

అనుకోకుండా అయిన గాయాల మచ్చలు చర్మంపై అలాగే ఉండిపోతాయి. ముఖ్యంగా కాలిన గాయాలు ఎక్కువ ఇబ్బంది పెడతాయి. వీటిని తగ్గించేందుకు నానా రకాల క్రీమ్స్ వాడుతుంటాం. కానీ ముఖంపై లేదా శ‌రీరంపై ఎక్కడైనా కాలిన గాయాలు, పుండ్లు వంటివి ఉంటే ఆయా భాగాల్లో నెయ్యి రాస్తే త్వర‌గా మానుతాయి. వంట చేసేవారికి కచ్చితంగా కాలిన మచ్చలు ఉంటాయి. తగ్గించుకోవడానికి కచ్చితంగా ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి:

రోజుకో ఉల్లిపాయ తింటే చాలు.. నెలసరి సమస్యలు దూరం

ఎండిన ఉసిరికాయల తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Side effects of drinking soft drinks :కూల్ డ్రింక్స్ అధికంగా తాగుతున్నారా.. పారా హుషార్..!

Next Story

Most Viewed