వెల్లుల్లికి రోగాలను తగ్గించే గుణం ఉందా? ప్రజలు ఎందుకు నమ్ముతారు?

by Disha Web Desk 10 |
వెల్లుల్లికి రోగాలను తగ్గించే గుణం ఉందా? ప్రజలు ఎందుకు నమ్ముతారు?
X

దిశ, ఫీచర్స్: ‘మీకు జలుబు చేసిందా? ఆలస్యం దేనికి వెల్లుల్లి వాసన చూడండి క్షణాల్లో తగ్గుతుంది. జ్వరం వచ్చిందా? ఘాటైన వెల్లుల్లి కారాన్ని అన్నంలో దట్టించి తింటే డాక్టర్ అవసరం లేదు’ అనే మాటలు మనం తరచూ వింటుంటాం. సోషల్ మీడియాలో కూడా ఈ విధమైన ప్రచారం జరుగుతూ ఉంటుంది. జనాదరణ పొందిన నమ్మకం కావడం వల్ల నిపుణులు కూడా పెద్దగా వ్యతిరేకించరు. కారణం ఏంటంటే అది అన్ని వ్యాధులను తగ్గించే రెమిడీ కాకపోయినప్పటికీ, యూజ్ చేయడం వల్ల కూడా పెద్దగా ప్రమాదం ఉండదు. కొన్ని విషయాల్లో ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగని అన్ని సందర్భాల్లో, అన్ని రోగాలకు ప్రత్యామ్నాయ వైద్య పరిష్కారం కాదని నిపుణులు చెప్తున్నారు. అయితే నమ్మకాలు, అపోహలు, వాస్తవాలను అర్థం చేసుకొని మసులుకోవాలని మాత్రం సూచిస్తున్నారు.

‘ఒక గ్లాసు పాలల్లో రెండు చిన్న వెల్లుల్లి రెబ్బల పేస్ట్ కలిపి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడంవల్ల భయంకరమైన ప్లేగు వ్యాధి నయం అవుతుంది’ అని 1965లో లండన్ సిటీలో వ్యాప్తి చెందింది. నేటికీ కొనసాగుతోంది. ఇండియాలో 2020లో కూడా కొవిడ్ నుంచి రక్షణ కోసం అనేక రెమిడీస్‌ను ప్రజలు ట్రై చేశారు. ముఖ్యంగా వెల్లుల్లి వ్యాధినిరోధకంగా పనిచేస్తుందని అనేక మంది నమ్మారు. దీనిపై సోషల్ మీడియాలోనూ విస్తృత ప్రచారం జరిగింది. ఆ సమయంలో ఓ 72 ఏళ్ల మహిళ డైలీ పచ్చి వెల్లుల్లిని యూజ్ చేయడంవల్ల ఆమె నాలుకపై కెమికల్ బర్న్ జరిగింది. చివరికి వెల్లుల్లి కొవిడ్ నుంచి రక్షించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ట్వీట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దురదృష్టవశాత్తు వెల్లుల్లిలో యాంటీ-మైక్రోబయల్ లక్షణాలతో కూడిన సమ్మేళనాలు ఉన్నాయని లేబొరేటరీ స్టడీస్ పేర్కొంటున్నప్పటికీ, అవి బ్యాక్టీరియా లేదా వైరస్ బారిన పడకుండా అడ్డుకోలేదని వైద్య నిపుణుల పరిశోధనలో వెల్లడైంది. అందుకే ప్రతీ సందర్భంలో వెల్లుల్లి వైద్యం పనిచేస్తుందనేది ఒక మూఢనమ్మకం తప్ప వాస్తవం కాదని నిపుణులు చెప్తున్నారు.


Next Story