ఉదయాన్నే టిఫిన్‌కు బదులు అన్నం తింటున్నారా?

by Dishanational2 |
ఉదయాన్నే టిఫిన్‌కు బదులు అన్నం తింటున్నారా?
X

దిశ, వెబ్‌డెస్క్ : చాలా మంది ఉదయాన్నే టిఫిన్ చేస్తుంటారు. కానీ కొంత మంది మాత్రం ఉదయాన్నే టిఫిన్‌కు బదులు అన్నం తింటూ ఉంటారు. అయితే ఇలా అన్నం తినడంతో కొందరిలో కొన్ని ప్రశ్నలు తలెత్తుంటాయి. అసలు ఉదయాన్నే అన్నం తినడం మంచిదేనా? తిన వచ్చా లేదా అని. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే ఉదయం అన్నం తినడం వలన శరీరానికి శక్తి ఇస్తుంది. కానీ ఉదయం ఎక్కువ మొత్తంలో అన్నం తినకూడదంట. రోజు మొదటి భోజనంలో అన్నం ఉండాల్సిందేనంట. ఉదయం శరీరం చాలా చురుకుగా ఉంటుంది. అందువలన చాలా శక్తి అవసరం.కాబట్టి తమ బరువును నియంత్రించుకోవడానికి ప్రయత్నించే వారు లేదా మధుమేహం ఉన్నవారు ఉదయం పూట అన్నం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధించవచ్చు. కానీ అది మితంగా, సమతుల్య భోజనంలో భాగంగా తినాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. అప్పుడే అన్నం పౌష్టికాహారంలో భాగం అవుతుందంట.

Next Story

Most Viewed