చేతిలో కొబ్బరికాయ, నీరు నిజంగానే నీటి జాడను గుర్తిస్తాయా?

by Disha Web Desk 8 |
చేతిలో కొబ్బరికాయ, నీరు నిజంగానే నీటి జాడను గుర్తిస్తాయా?
X

దిశ, ఫీచర్స్ : టెక్నాలజీఎంత వేగంగా అభివద్ధి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మానవుడితో సంబంధం లేకుండా, ఏ చిన్న పనైనా సరే చిటికెలో చేయడానికి యంత్రాలు వచ్చాయి. ఇలాంటి రోజుల్లో ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో బోర్లు లేదా బావులు తవ్వుకోవడానికి సంప్రదాయపద్దతులనే ఉపయోగిస్తున్నారు.

వ్యవసాయం కోసం బావులు తవ్వాలన్నా, బోర్లు వేయాలన్న, ఇంటి వద్ద బోర్లు వేయాలన్నా ఇప్పటికీ చాలా మంది, కొబ్బరికాయా , వై ఆకారంలో వేపపుల్ల లేదా చెంబులో నీళ్లను ఉపయోగించి నీటి జాడను తెలుసుకుంటారు. చాలా వరకు ఇవి సక్సెస్ అవుతుంటాయి.

కొబ్బరికాయను పట్టుకొని తిరిగినప్పుడు, భూగర్భంలో వాటర్ లెవల్ ఫోర్స్‌ను బట్టి కొబ్బరికాయ లేస్తుందని, దాని బట్టీ నీరు ఎన్ని అడుగుల్లో ఉందో తెలుసుకోవచ్చునంట. నీళ్లు ఉన్నప్పుడు కొబ్బరికాయ లేవడం, రెండు, మూడు వాటర్ లైన్లు ఉన్న ప్పుడు తిరగుతుందంట. ఇలా బోర్లు వేస్తుంటారు.

అయితే దీన్ని జియాలజిస్ట్ వారు అశాస్త్రీయం అని కొట్టిపారేస్తున్నారు. పుష్కలంగా నీటి వనరులు ఉన్నప్పుడు ఏ పద్ధతిని అనుసరించి చెప్పినా నీళ్లు పడతాయి. కొన్ని ప్రాంతాల్లో అస్సలే నీరు ఏర్పడవు, కరువు ప్రాంతాల్లో ఎంత ప్రయత్నించినా అక్కడ నీళ్లు రావు, అక్కడ శాస్త్రీయ పద్ధతులు ఉపయోగించినా ఎలాంటి ఫలితం ఉండదంట.


Next Story