బంగారాన్ని పింక్ కలర్ పేపర్‌లోనే ఎందుకు చుట్టి ఇస్తారో తెలుసా?

by Dishanational2 |
బంగారాన్ని పింక్ కలర్ పేపర్‌లోనే ఎందుకు చుట్టి ఇస్తారో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : కొన్ని వస్తువులను చూస్తే మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.అసలు దీనికి ఈ కలరే ఎందుకు వాడుతారు, ఈ వస్తువు దీనికే ఎందుకు ఉంటుందని కొందరు ఆలోచిస్తారు. అసలు కొందరు పట్టించుకోరు.

అయితే బంగారం కొనకుండా ఎవ్వరూ ఉండలేరు. చాలా మంది బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే బంగారాన్ని కొనుగోలు చేసిన తర్వాత దానిని పింక్ కలర్ పేపర్ లో చుట్టి ఇవ్వటం మీరు గమనించే ఉంటారు. కానీ బంగారాన్ని పింక్ కలర్ పేపర్ లోనే చుట్టి ఎందుకు ఇస్తారో అనేది చాల మందికి తెలియదు.

అయితే దీనికి ఒక కారణం ఉందంట. కొనుగోలుదారులకు ఎలా చూపిస్తే ఆకర్షనీయంగా కనిపిస్తుంది అనే అంశంపై దృష్టి పెడతారు. ఎందుకంటే ఒక వస్తువుని అమ్మేటప్పుడు దాని బ్యాగ్రౌండ్ బాగుంటేనే ఆ వస్తువు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

శాస్త్రీయంగా గులాబీ రంగు కాగితం బంగారం కాంతిని ప్రతిబింబించేలా ఆభరణాలు మరింత ఆకర్షణయంగా కనిపించేలా చూపిస్తాయి. ఒకవేళ చుట్టే కాగితం తెల్లగా ఉంటే మనకు చూపించే ఆభరణాలు ఎక్కువగా తెలుపు రంగులను ప్రతిబింబిస్తుంది. తద్వారా ఆభరణాల మెరుపు తగ్గుతుంది. అందుకే ఆభరణాల వ్యాపారులు గులాబీ రంగును ఎంచుకున్నారు. ఈ గులాబీ రంగు కాగితం అనేది బంగారు ఆభరణాలను మరింత ఆకర్షణీయంగా చూపిస్తుంది.

Read More: గ్యాస్ సిలిండర్ ఎరుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?

Next Story

Most Viewed