Kitchen: ఈ వంటింటి చిట్కాల గురించి మీకు తెలుసా?

by Disha Web Desk 10 |
Kitchen: ఈ వంటింటి చిట్కాల గురించి మీకు తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా మనం లేచిన దగ్గర నుంచి వంట గదిలోనే ఎక్కువ సమయాన్ని గడుపుతుంటాము. ఎందుకంటే మన తినే ఆహారాన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. మనలో కొందరికీ వంటింటి చిట్కాల గురించి అవగాహన ఉండదు. ఉదాహరణకు ఒకటి చెప్పుకుందాం. మార్కెట్ నుంచి నిమ్మకాయలు ఇంటికి తెస్తాం.. అలా తీసుకొచ్చిన నిమ్మకాయలు ఒకటి లేదా రెండు రోజులు వరకు మంచిగా ఉంటాయి.. ఆ తర్వాత ఎండిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే కొన్ని వంటింటి చిట్కాలను పాటించాలి. అవేంటో ఇక్కడ చూద్దాం..

1. తోడు పెట్టిన పాలల్లో చిన్న కొబ్బరి ముక్క వేస్తే పెరుగు తినడానికి రుచి కరంగా ఉంటుంది.

2. తేనే సీసాలో రెండు మూడు మిరియాలు వేస్తె ఎక్కువ కాలం నిల్వ ఉటుంది. అలాగే చీమలు కూడా పట్టకుండా ఉంటాయి.

3. దుంపలను ఉప్పు కలిపిన నీటిలో 15 నిముషాలు నానబెట్టి ఆ తర్వాత ఉడికించండి. ఇలా చేయడం వాళ్ళ త్వరగా ఉడుకుతాయి.

4. నిమ్మకాయల్ని తడి బట్టలో చుట్టి పాలిథిన్ కవర్లో ఉంచితే ఎక్కువ రోజులు ఉంటాయి.

4. పచ్చి నిమ్మకాయలకు పేపర్ చుట్టి ఫ్రిజ్లో పెడితే కొన్ని రోజుల వరకు పచ్చి గానే ఉంటాయి.

Also Read:

Weight Gain Tips: సన్నగా ఉన్న వారు .. వీటిని ఫాలో అయితే లావు అవ్వొచ్చు!



Next Story

Most Viewed