దేశవ్యాప్తంగా ఎన్ని గ్రామాలకు దేవుళ్ల పేర్లు ఉన్నాయో తెలుసా..

by Disha Web Desk 20 |
దేశవ్యాప్తంగా ఎన్ని గ్రామాలకు దేవుళ్ల పేర్లు ఉన్నాయో తెలుసా..
X

దిశ, ఫీచర్స్ : మనం ట్రైన్ లోనో, బస్సులోనో, విమానంలోనో ప్రయాణం చేసేటప్పుడు టికెట్ తీసుకోవాలంటే కచ్చితంగా ఆ గ్రామం పేరు చెబుతారు. అలాగే మనం సొంత వాహనంలో ఎక్కడికైనా వెళ్లాలంటే లొకేషన్ కోసం గూగుల్ మ్యాప్స్ లో గ్రామం పేరును సెర్చ్ చేస్తాం. అయితే మన భారత దేశంలో ఎక్కువగా దేవుళ్లు దేవతల పేరుమీదే ఎక్కువగా గ్రామాలు ఉన్నాయని ఓ సర్వేలో తేలింది. మన భారతదేశ వ్యాప్తంగా సుమారుగా 6 లక్షల 77 వేల గ్రామాలు ఉన్నాయని నివేదికలు వెల్లడించాయి. ఈ డేటా అధ్యయనంలోనే హిందూ దేవుళ్ళు, దేవతల పేర్లతో అనేక గ్రామాలు తేలింది. ఉత్తరాది, దక్షిణాదితో సహా దేశవ్యాప్తంగా రాముడి పేరుతో వేలాది గ్రామాలు ఉన్నాయి. అలాగే మహాభారతం, మొఘల్ పాలకుల పాత్రల పేర్లతో కూడా గ్రామాలు ఉన్నాయి. భారతదేశంలోని గ్రామాలకి ఏ పేర్లు ఎక్కువగా ఉన్నాయో తెలుసుకుందాం.

చాలా గ్రామాలకు ఈ హిందూ దేవుళ్ల పేర్లు..

భారతదేశంలో హిందూ దేవతలకు సంబంధించిన పేర్లతో ఉన్న గ్రామాల సంఖ్య వేలల్లో ఉన్నాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం కేరళ తప్ప, దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో శ్రీరాముడు, కృష్ణుడి పేరుతో కనీసం ఒక గ్రామం అయినా ఉందట. ఇప్పటి వరకు భారతదేశంలో రాముడి పేరు మీద 3,626 గ్రామాలు ఉన్నాయని తేలింది. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 1,026 గ్రామాలు ఉన్నాయి. కృష్ణుడి పేర్లకు సంబంధించి 3,309 గ్రామాలు ఉన్నాయి. వీటిలో మాధోపూర్, గోపాల్‌పూర్, గోవింద్‌పూర్, శ్యామ్‌నగర్ లాంటి పేర్లు ఉన్నాయి. ఒక్క గోవర్ధన్ పేరుతో 81 గ్రామాలు ఉన్నాయి. అదేవిధంగా గణేష్ పేరుతో 446 గ్రామాలు ఉన్నట్లు గుర్తించారు. సిక్కు మత స్థాపకుడు గురునానక్ సాహిబ్‌కు అంకితం చేసిన 35 గ్రామాలు ఉన్నాయి.

మహాభారతం, రామాయణంలోని పాత్రల పేర్లు..

హిందూ మతంలో మహాభారతం, రామాయణం రెండు అత్యంత గౌరవనీయమైన, ముఖ్యమైన పురాణ గ్రంథాలు. ఈ గ్రంథాలలోని పాత్రల పేర్లతో కూడా గ్రామాలకు పేర్లను పెట్టారు పూర్వీకులు. కొన్ని నివేదికల ప్రకారం దేశంలో 187 గ్రామాలకు భరత్ (రాముడి సోదరుడు) పేరు పెట్టారు. అలాగే లక్ష్మణ్ (రాముడి సోదరుడు) పేరిట 150 కంటే ఎక్కువ గ్రామాలు ఉన్నాయి.

రామాయణంలోని ప్రధాన పాత్ర, రాముని భార్య 'సీత' పేరుతో 75 గ్రామాలు ఉన్నాయి. అయితే ప్రముఖ పాత్ర 'హనుమాన్' పేరు మీద 367 గ్రామాలు ఉన్నాయి. అలాగే కొన్ని గ్రామాల పేర్లు రావణుడు, రావణుడి తండ్రి అహిరావణుని పేరుతో ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామాల పేర్లు కూడా రామ్ నగరి 'అయోధ్య' అనే పేరుతో ఉన్నాయి.

మహాభారతం గురించి చెప్పాలంటే పాండవులలో భీముని పేరు మీద అత్యధిక గ్రామాలు ఉన్నాయి. వారి సంఖ్య 385. భీముడు పాండవులలో రెండవ స్థానంలో ఉన్నాడు. వారిలో అత్యంత శక్తివంతుడిగా పరిగణిస్తాడు. దీని తరువాత పాండవులలో మూడవ స్థానంలో ఉన్న అర్జునుడు వస్తాడు. అతని పేరు మీద 259 గ్రామాలు ఉన్నాయి. సత్యానికి చిహ్నంగా, పాండవుల జ్యేష్ఠ సోదరుడిగా చెప్పే యుధిష్ఠిరునికి అంకితం చేసిన రెండు గ్రామాలు మాత్రమే ఉన్నాయి. ఒరిస్సాలోని గంజాం జిల్లాలో ఉన్న భీష్మ పితామహ పేరులో ఒకే ఒక గ్రామం ఉంది.

ఇక మొఘలులు భారతదేశాన్ని 300 సంవత్సరాలకు పైగా పాలించారు. మొఘల్ పాలకుల పేరుతో ఒక డజను గ్రామాలకు మూడవ మొఘల్ చక్రవర్తి అక్బర్ పేరు పెట్టారు. వారి మొత్తం సంఖ్య 234. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు, అక్బర్ తాత అయిన 'బాబర్'కు 62 గ్రామాలు ఉన్నాయి. అక్బర్ తండ్రి హుమాయూన్ పేరిట 30 గ్రామాలు ఉన్నాయి. తాజ్ మహల్, ఎర్రకోటను నిర్మించిన షాజహాన్‌ పేరుతో 51 గ్రామాలు, చివరి ప్రధాన మొఘల్ పాలకుడు ఔరంగజేబు పేరుతో 8 గ్రామాలు ఉన్నాయి. ఔరంగజేబు పేరుగల గ్రామాలన్నీ ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో ఉన్నాయి.



Next Story

Most Viewed