వీధుల్లో నగ్నంగా తిరగొచ్చు.. కోర్టు పర్మిషన్

by Disha Web Desk 10 |
వీధుల్లో నగ్నంగా తిరగొచ్చు.. కోర్టు పర్మిషన్
X

దిశ, ఫీచర్స్ : ఓ వ్యక్తికి వీధుల్లో నగ్నంగా తిరిగేందుకు అనుమతిచ్చింది స్పెయిన్‌ న్యాయస్థానం. కంప్యూటర్ సైంటిస్ట్ అలెజాండ్రో కొలోమర్‌కు బట్టలు లేకుండా స్వేచ్ఛగా తిరిగే హక్కును ప్రసాదించింది. అసాధారణ లైంగిక చర్యలకు పాల్పడేందుకు తాను నగ్నత్వాన్ని కోరుకోవడం లేదని.. కేవలం తనకు ఇలా ఉండటం ఇష్టం కాబట్టే చేస్తున్నానని తన వెర్షన్‌ను వినిపించిన అలెజాండ్రో.. నగ్నత్వం కోసం చేస్తున్న యుద్ధంలో అంతిమ విజయం సాధించాడు.

అలెజాండ్రో చిన్నప్పటి నుంచి స్పెయిన్‌లోని న్యూడిస్ట్ బీచ్‌లకు హాజరవుతున్నాడు. ఈ క్రమంలోనే 29ఏళ్ల ఆయన.. 2020లో తన ఇంటి సమీపంలోని కొన్ని వీధుల్లో తిరగడం ప్రారంభించాడు. 1988లో కోర్టు తీర్పు ప్రకారం స్పెయిన్‌లోని చాలా ప్రాంతాల్లో బహిరంగ నగ్నత్వం అనేది నేరం కాదు. కానీ బార్సిలోనా, వల్లాడోలిడ్ వంటి కొన్ని ప్రదేశాలు ఇందుకు వ్యతిరేకంగా నియమాలను కలిగి ఉన్నాయి. తన స్వస్థలం అల్డాయాలోనూ ఈ రూల్స్ వర్తిస్తున్నాయి.

మొత్తానికి చివరగా అలెజాండ్రో కేసును వాలెన్సియాలోని స్పానిష్ హైకోర్టు సమర్థించింది. అల్డాయాలోని రెండు వేర్వేరు వీధుల్లో, వేర్వేరు సమయాల్లో నగ్నంగా తిరగడానికి తనను తాను పరిమితం చేసుకున్నాడని.. అతని చర్యలు ఇతరులకు ఇబ్బందిగా సూచించబడలేదని తీర్పునిచ్చింది. అయితే అలెజాండ్రో నగ్నంగా న్యాయస్థానంలోకి ప్రవేశించడాన్ని నిరాకరించిన కోర్టు.. బట్టలు వేసుకున్నాకే అతన్ని అనుమతించింది. ఆపై కేసును విచారించి, దాదాపు రూ.2,50,000 జరిమానా విధించి నగ్నంగా తిరిగే స్వేచ్ఛను ప్రసాదించింది. నిజానికి అతను ఆ చట్టాలకు విరుద్ధంగా లేనప్పటికీ, విపరీతమైన నగ్నత్వాన్ని కవర్ చేసే వాలెన్సియాలోని కొన్ని నగర చట్టాలను ఉల్లంఘించినందుకు జరిమానా విధించబడినట్లు అలెజాండ్రో న్యాయవాది తెలిపాడు.


Next Story