అర్ధరాత్రి నిద్ర మేల్కొన్నాక మళ్లీ కునుకు పట్టదు.. అసలు రీజన్ అదేనట!

by Disha Web Desk 10 |
అర్ధరాత్రి నిద్ర మేల్కొన్నాక మళ్లీ కునుకు పట్టదు.. అసలు రీజన్ అదేనట!
X

దిశ, ఫీచర్స్: కొందరు తరచూ మధ్య రాత్రిళ్లు నిద్ర మేల్కొంటూ ఉంటారు. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా కంటిమీద కునుకు రాదు. ఎందుకిలా జారుగుతుందో బాధితులకు కారణాలు తెలియవు. స్ట్రెస్‌వల్ల నిద్ర పట్టకపోవడం జరుగుతుంది కానీ, అర్ధరాత్రిళ్లు మేల్కోనడం, అందుకు గల డిస్టర్బెన్స్‌కు అసలు రీజన్ కనుగొనే ప్రయత్నంలో అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ నిపుణులు ఒక నిర్ధారణకు వచ్చారు. అదేంటంటే.. కార్టిసాల్ అనే హార్మోన్ లెవల్స్‌లో మార్పులే ఇందుకు మెయిన్ రీజన్ అని చెప్తున్నారు. సాధారణంగా కార్టిసాల్ లెవల్స్ మిడ్‌నైట్‌లో అత్యల్ప స్థాయికి పడిపోతాయి. నిద్రపోయిన తర్వాత రెండు నుంచి మూడు గంటలు పెరుగుతాయి. ఒక వ్యక్తి మేల్కొనే సమయానికి గరిష్ట స్థాయికి చేరుకునేదాకా పెరుగుతూనే ఉంటాయి. సరిగ్గా ఇలాంటి హెచ్చు తగ్గులు బ్యాలెన్స్ తప్పినప్పుడు తరచూ నిద్రకు భంగం కలగడం, ఒకసారి మేల్కొన్నాక మళ్లీ నిద్ర పట్టకపోవడం జరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. నిజానికి ఒత్తిడి హార్మోన్ అని పిలువబడే కార్టిసాల్, రెండు అడ్రినల్ గ్రంధుల ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. ఒక వ్యక్తి స్ట్రెస్‌కు గురైనప్పుడు, పెరిగిన కార్టిసాల్ రిలీజ్ అయి బాడీపై ఎఫెక్ట్ చూపుతుంది. అందుకే ఈ హార్మోన్ బ్యాలెన్స్‌ను కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ అని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే వ్యక్తుల జీవక్రియను, రక్తపోటును నియంత్రించడంలో, మంటను తగ్గించడంలో కీ రోల్ పోషిస్తుంది.

Read More: టీనేజ్‌లో ఇన్‌‌సెక్యూర్ ఫీలింగ్స్.. పెద్దయ్యాక 68% మందిలో కంటిన్యూ అవుతున్నాయట

Next Story

Most Viewed