లైంగిక జీవితంపై ప్రభావం చూపుతున్న వ్యాధులు..కంట్రోల్లో ఉంచుకోకపోతే కష్టమే!

by Dishafeatures2 |
లైంగిక జీవితంపై ప్రభావం చూపుతున్న వ్యాధులు..కంట్రోల్లో ఉంచుకోకపోతే కష్టమే!
X

దిశ, ఫీచర్స్ : దాంపత్య జీవితంలో ఆనందంగా ఉండాలంటే భార్యా భర్తల మధ్య పరస్పర అవగాహనతో పాటు పర్సనల్ రిలేషన్ స్ట్రాంగ్‌గా ఉండాలని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా శృంగార జీవితం బాగున్నప్పుడే సంతోషంగా ఉండగలుగుతారు. కానీ ప్రస్తుతం కొన్ని రకాల వ్యాధులు, మానసిక రుగ్మతలు అందుకు ఆటంకంగా మారుతున్నాయని, ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది వీటి బారిన పడి పడక సుఖానికి దూరం అవుతున్నారని ఇటీవలి నివేదికలు పేర్కొంటున్నాయి. ఆ వ్యాధులు ఏమిటి? ఎలా ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం.

డిప్రెషన్ : భారత దేశంలో ఈ సమస్య కాస్త తక్కువగానే ఉంది. కానీ ప్రపంచ వ్యాప్తంగా డిప్రెషన్ బాధితులు పెరుగుతున్నారు. అది వారి లైంగిక జీవితంపై ప్రభావం చూపుతోంది. ఉరుకులు, పరుగుల జీవితం, స్ట్రెస్‌ఫుల్ వర్క్ కల్చర్‌, ఆహారపు అలవాట్లు డిప్రెషన్‌తోపాటు క్రమంగా సెక్సువల్ డిజార్డర్స్‌కు దారితీస్తున్నాయి. దీంతో స్త్రీ, పురుషుల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తలెత్తి వారి శృంగార జీవితాన్ని ప్రభావితం చేస్తు్న్నాయి.

రుమటాయిడ్ ఆర్థరైటిస్ : యూఎస్‌కు చెందిన వరల్డ్ రుమాటాలజీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నిపుణుల ప్రకారం రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా ‘గౌట్ వ్యాధి’ కీళ్లు, కండరాల నొప్పికి కారణం అవుతుంది. పైగా బాధితుల్లో శారీరక బలహీనతకు దారితీస్తుంది. ఇది నేరుగా లైంగిక జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఆర్థరైటిస్ బాధితులు ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనలేరు. ఫలితంగా దాంపత్య జీవితంలో సమస్యలకు కారణం అవుతోంది. వ్యాధి నివారణకోసం వాడే మెడికేషన్స్, ట్రీట్మెంట్స్ కూడా లిబిడోకు కారణం అవుతున్నాయి.

డయాబెటిస్: డయాబెటిస్ బాధితుల్లో లైంగిక శక్తి తగ్గుతుందని అమెరికన్ డయాబెటిస్ రిపోర్టు పేర్కొంటున్నది. షుగర్ వ్యాధిని కంట్రోల్లో ఉంచుకోకపోతే బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి. ఇవి లైంగిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. అంతేకాకుండా శరీరం నుంచి జననేంద్రియాలకు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది. దీంతో మానసిక ఆందోళన పెరగడం, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడటం వంటివి మరింత అధికం అవుతాయి. దంపతుల మధ్య లైంగిక సంబంధాన్ని దెబ్బతీస్తాయి.

పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ : ఇదొక తీవ్రమైన మానసిక సమస్యగా నిపుణులు పేర్కొంటున్నారు. జీవితంలో బాధాకరమైన అనుభవాలను ఎదుర్కొనే వ్యక్తుల్లో ఇది సంభవించే చాన్సెస్ అధికంగా ఉంటాయి. మనస్సును కలిచి వేసే సంఘటనలను, లైంగిక వేధింపులను తరచుగా ఎదుర్కొనే వారు దీని బారిన పడవచ్చు. క్రమంగా వారిలో అతి ఆలోచనలు, నిద్రలేమి, నిరాశ వంటి భావాలు పెరుగుతాయి. లైంగిక జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. దీంతోపాటు క్యాన్సర్, క్రానిక్ ఫెటీగ్స్ కూడా దంపతుల్లో శృంగార జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. పడక సుఖాన్ని దూరం చేస్తాయి.


Read More..

పిల్లలు పుట్టాలంటే ఈ నిమ్మకాయతో ట్రై చేయాల్సిందే.. కానీ ధర తెలిస్తే షాక్ అవుతారు!


Next Story