Diabetes : మధుమేహ వ్యాధిగ్రస్తులు చికెన్ తినవచ్చా?

by Disha Web Desk 10 |
Diabetes : మధుమేహ వ్యాధిగ్రస్తులు చికెన్ తినవచ్చా?
X

దిశ, వెబ్ డెస్క్: మధుమేహ వ్యాధితో బాధ పడే వారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంలో అవసరమైన కొన్ని మార్పులు చేసుకోవడం వలన రక్తంలో చక్కెరను చాలా వరకు నియంత్రించవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు చికెన్ తినకూడదని చెబుతుంటారు. మధుమేహంతో బాధపడుతున్నారా..? అయితే ఇలాంటి పరిస్థితిలో చికెన్ తినవచ్చా? లేదో అన్నది ఇక్కడ తెలుసుకుందాం..

మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే ఆహారంలో ప్రోటీన్ అధికంగా ఉండే సలాడ్‌ను చేర్చుకోండి. అలాగే పనీర్, బీన్స్ శాఖాహారులకు మంచి ఆహారం. మీరు నాన్ వెజ్ తినడానికి ఇష్టపడితే, మీరు గ్రిల్డ్ చికెన్‌ని మీ ఆహారంలో చేర్చుకోవచ్చు అలాగే దీనితో చికెన్ సలాడ్ కూడా తీసుకోవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు సలాడ్లు తయారుచేసేటప్పుడు మయోన్నైస్, క్రీమ్, సోయా సాస్ మొదలైన వాటిని ఉపయోగించకూడదు. చికెన్ సలాడ్‌ చేసేటప్పుడు ఆలివ్ నూనెను ఉపయోగించండి. ఇది డయాబెటిక్ పేషంట్స్ కు ప్రయోజనకరంగా ఉంటుంది.

Next Story

Most Viewed