Calcium deficiency: శరీరంలో కాల్షియం లోపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

by Disha Web Desk 10 |
Calcium deficiency: శరీరంలో కాల్షియం లోపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
X

దిశ, ఫీచర్స్: ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి శరీరానికి ఇతర పోషకాలతో పాటు తగినంత కాల్షియం అవసరం. కొన్నిసార్లు అది లోపించడం సహజంగానే జరుగుతూ ఉంటుంది. దీనివల్ల అప్పటికప్పుడు పెద్ద సమస్య తలెత్తకపోవచ్చు కానీ, దీర్ఘకాలంపాటు బాడీకి కాల్షియం అందకపోతే మాత్రం ప్రమాదమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పోషకాహారంపట్ల అవగాహన, ఆహార నియమాలవల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు.

బాడీలో కొన్నిరకాల మార్పులు కాల్షియం లోపిస్తున్నాయని మనకు సిగ్నల్స్ ఇస్తాయి. హార్ట్ బీట్‌లో కొంచెం తేడా అనిపిస్తుంది. ఎందుకంటే కాల్షియం తక్కువగా ఉండటంవల్ల గుండె కండరాలపై ప్రభావం చూపుతుంది. గుండె కణాలకు కూడా కాల్షియం అందకపోతే వాటి పనితీరు మందగిస్తుంది. పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే ప్రాణహాని సంభవించే అవకాశం లేకపోలేదు. కాల్షియం లోపించినవారిలో తరచూ కండరాల తిమ్మిరి, కండరాల నొప్పి, కండరాల బలహీనత కనిపిస్తుంది. అలాగే న్యూరో ట్రాన్స్‌మిటర్లను రిలీజ్ చేసేందుకు మెదడు కణాలకు తగిన కాల్షియం అవసరం. ఇది సరిగ్గా అందకపోతే మెదడు దెబ్బతినేందుకు కారణమయ్యే హైపోకాల్సెమియా సమస్య తలెత్తవచ్చు. ఇక దంతాలకు సంబంధించిన అన్ని సమస్యలు దాదాపు కాల్షియం లోపంవల్ల తలెత్తుతాయి. ఇవేగాక ఇంకా అనేక రకాల ఆరోగ్య సమస్యలకు కాల్షియం లోపం కారణం అవుతుంది. అందుకే రోజూ తీసుకునే ఆహారంలో ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, పాలు, గుడ్లు, కాల్షియం కలిగిన ఇతర ఆహారాలు తీసుకోవాలి. సమస్య తీవ్రతను బట్టి వైద్య నిపుణులను సంప్రదించాలి. కాల్షియం మాత్రలు తీసుకోవడంవల్ల కూడా లోపాన్ని అధిగమించవచ్చు.

ఇవి కూడా చదవండి:

14 ఏళ్లలో 4,500 స్మోక్ బ్రేక్స్.. 9 లక్షలు ఫైన్ వేసిన జపనీస్ కంపెనీ


Next Story