గూగుల్ క్రోమ్ వాడుతున్నారా.. అయితే వెంటనే అప్‌డేట్ చేయండి.. లేదంటే..?

by Disha Web Desk 7 |
గూగుల్ క్రోమ్ వాడుతున్నారా.. అయితే వెంటనే అప్‌డేట్ చేయండి.. లేదంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది. పెద్ద చిన్న అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో సిస్టమ్స్, చేతిలో స్మార్ట్ ఫోన్‌లు ఉంటున్నాయి. అయితే.. స్మార్ట్ ఫోన్‌లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే వెబ్ బ్రౌజర్‌లలో క్రోమ్ ఒకటి. ప్రతీ ఒక్కరూ ఏదో ఒక అవసరం చేత నిత్యం క్రోమ్‌ను ఉపయోగిస్తుంటారు. కాబట్టి మీరు ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంది. మీ క్రోమ్ పాత వెర్షన్‌లో ఉందా..? అయితే తాజా వెర్షన్‌లోకి అప్ డేట్ చేసుకోండి. లేదంటే మీరు ప్రమాదంలో పడినట్లే. ఎందుకంటే..?

పాత వెర్షన్ క్రోమ్‌లో ఓ బగ్‌ని గూగుల్ కనుకొంది. ఒక బ్లాగ్ పోస్ట్‌లో గూగుల్ పోస్ట్ చేసిన వివరాల మేరకు.. ఈ బగ్ విండోస్ (windows), ఎమ్ఏసీ (Mac), లినక్స్ (Linux) లో క్రోమ్‌ను ప్రభావితం చేస్తుందని పేర్కొంది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో రెండు సెక్యూరిటీ బగ్‌లను గుర్తించారు. సీవిఈ (CVE)-2023-2033 లో అనే బగ్ డేంజరస్ అని గూగుల్ గుర్తించింది. గూగుల్ థ్రెట్ అనాలిసిస్ గ్రూప్ ఈ బగ్‌ను గుర్తించింది. ఈ భద్రతా లోపాన్ని పరిష్కరించడానికి గూగుల్ కొత్త క్రోమ్ అప్‌డేట్‌ని విడుదల చేసింది. వినియోగదారులు వీలైనంత త్వరగా క్రోమ్ బ్రౌజర్‌లను అప్‌డేట్ చేసుకోవాలని తెలిపింది.

గూగుల్ క్రోమ్‌ అప్‌డేట్..

క్రోమ్‌ను అప్‌డేట్ చేయడానికి ముందుగా మీ ఫోన్ ఇంకా సిస్టమ్‌లో క్రోమ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేసి పైన ఉన్న మూడు చుక్కలను క్లిక్ చేయాలి. అందులో సెట్టింగ్ అనే ఆప్షన్ ఎంచుకుని ‘About Chrome’ పై క్లిక్ చేయాలి. ఇక్కడ ఎలాంటి వెర్షన్‌ని ఉపయోగిస్తున్నారో తెలుసుకుని.. పాత వెర్షన్‌లో ఉంటే కొత్త వెర్షన్‌లోకి అప్‌డేట్ చేసుకోండి.

Next Story

Most Viewed