థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారా.. ఈ ఆహార టిప్స్ పాటించండి!

by Disha Web Desk 8 |
థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారా.. ఈ ఆహార టిప్స్ పాటించండి!
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం చాలా మంది థైరాయిడ్ వ్యాధితో బాధపడుతున్నారు. పెళ్లైన వారు, కానీ వారు ఇలా అందరూ థైరాయిడ్ సమస్యతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో అసలు ఈ థైరాయిడ్ పనితీరు ఎలా మెరుగు పరుచుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అనే విషయాలు తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కాగా థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఏ ఆహారం తీసుకుంటే మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

థైరాయిడ్ సక్రమంగా పనిచేయడానికి విటమిన్ ఇ, మెగ్నీషియం, విటమిన్ బి,విటమిన్ సి, సెలీనియం అనేది చాలా అవసరం.అయితే ఇవి అధికంగా ఉండే ఫుడ్ తీసుకోవడం వలన థైరాయిడ్ హార్మోన్స్ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయంట.

వీటి కోసం పొద్దుతిరుగుడు విత్తనాలు, చికెన్, ఫిష్, పుట్టగొడులు,బాదం, గోధుమ గింజలు, డార్క్ చాక్లెట్ బీన్స్, క్వినోవాలో, గుమ్మడి గింజలు,వేరుశెనగ, చికెన్ బ్రెస్ట్,ట్యూనా వంటి మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలంట. దీని వలన థైరాయిడ్ సక్రమంగా పని చేస్తుంది అంటున్నారు నిపుణులు.


Next Story