Stress: పరీక్షల వేళ ఒత్తిడికి గురవుతున్నారా?.. అయితే ఇది పాటించండి!

by Disha Web Desk 10 |
Stress: పరీక్షల వేళ ఒత్తిడికి గురవుతున్నారా?.. అయితే ఇది పాటించండి!
X

దిశ, ఫీచర్స్ : ఎప్పుడూ బాగా చదవగలిగే వారు కూడా ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయంటే ఆందోళన చెందుతుంటారు. చదివే క్రమంలో ఒత్తిడికి గురవుతుంటారు. చదివింది గుర్తుండకపోవడం అనే సమస్య కూడా తలెత్తుతుంది. దీనివల్ల మరింత ఆందోళనకు గురవుతుంటారు. అతి ఆలోచనలతో ఆకలి మందగించడం, నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి పరీక్షలకోసం ప్రిపేర్ అయ్యేవారు ఒత్తిడి లేకుండా చూసుకోవడం ఒక్కటైతే ఒత్తిడి ప్రభావం ఆరోగ్యంపై పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని రకాల ఆహారాలు, పండ్లు, విటమిన్లు ఒత్తిడిని దూరం చేస్తాయంటున్నారు ఆహార నిపుణులు అవేమిటో తెలుసుకుందాం.

ఎగ్జామ్స్ వేళ కాస్త ఒత్తిడి ఉండటం సాధారణమే అయినా అది చదివింది మర్చిపోయేంత సమస్య ఉంటే ప్రమాదమే అంటున్నారు నిపుణులు. బాగా చదవాలని కుటుంబ సభ్యలు, టీచర్లు ఒత్తిడి తేవడం, పరీక్షలు దగ్గర పడుతున్నాయని రెస్టులేకుండా చదివించడం, సమయానికి తిండి, నిద్ర లేకపోవడం అనేది విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒత్తిడి ప్రభావాన్ని మరింత పెంచే ఆహారాలకు దూరంగా ఉండాలి.

కెఫిన్‌కు దూరంగా ఉండండి

కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్ వంటివి ఎగ్జామ్స్ టైమ్‌లో తరచూ తీసుకోవడంవల్ల నిద్రలేమి, ఆందోళన, చికాకు వంటి సమస్యలు తలెత్తుతాయి. దీనివల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. కాఫీ, టీ, కార్బోనేటేడ్ కలిగిన పానీయాలలో ఉండే కెఫిన్ అనే పదార్థం నిద్రలేమితో పాటు వివిధ అనారోగ్యాలకు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. పరీక్షల వేళ. అసలే ఆందోళనలో ఉండి ప్రిపేర్ అవుతున్న వారు వీటిని ఎక్కువగా తీసుకోవడంవల్ల మెదుడు చరుగ్గా పనిచేయకపోవడం, చదివింది గుర్తుండకపోవడం వంటి సమ్యలు తలెత్తుతాయి. కావట్టి నవారించడం బెటర్.

టైమ్‌కు తినండి

ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయంటే చాలు స్టూడెంట్స్ గానీ, ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యేవారుగానీ తిండి సమయానికి తినరు. దీనివల్ల మానసిక ఆందోళన, చికాకు పెరుగుతుంది. జ్ఞాపకశక్తిపై ప్రభావం పడుతుంది. అందుకే టైమ్ తినాలి. దీనివల్ల శరీరానికి కావాల్సిన శక్తి లభించి ఒత్తిడి ప్రభావం తగ్గుతుంది.

నీరు బాగా తాగాలి

మార్చి, ఏప్రిల్ , మే నెలల్లో వివిధ రకాల ఎగ్జామ్స్ ఎక్కువగా వస్తుంటాయి. ప్రిపరేషన్‌లో బిజీగా ఉంటూ పలువురు నీళ్లు తాగడం మర్చి పోతుంటారు. లేదా సరిపడా నీళ్లు తాగరు. దీనివల్ల డీ హైడ్రేషన్ సమస్య తలెత్తుంది. అందుకే చదువుకునేటప్పుడు దగ్గరగా ఒక వాటర్ బాటిల్ కచ్చితంగా పెట్టుకోవాలి. మధ్య మధ్యలో వాటర్ తాగుతూ ఉండాలి. దీనివల్ల ఒత్తిడి తగ్గడమేగాక ఆరోగ్యానికీ మేలు జరుగుతుంది. రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగడం మంచిదని నిపుణులు చెప్తున్నారు.

జ్ఞాపకశక్తిని పెంచే ఆహారం

చదివింది సరిగ్గా గుర్తుండకపోడం అనేది ఎగ్జామ్స్ ముందు చాలా మంది ఎదుర్కొనే సమస్య. కొన్ని రకాల హార్మోన్లు, శరీరానికి కావాలసిన పోషకాలు అందకపోవడం కూడా ఇందుకు కారణం కావచ్చు. అందుకే జ్ఞాపక శక్తి పెరిగేందుకు దోహదం చేసే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కలిగిన ఆహారం, పండ్లు తీసుకోవాలి. వాల్ నట్స్, అవిసె గింజలు, గుమ్మడికాయ విత్తనాలు, నువ్వులు, సోయాబీన్ నూనె వంటి ఆహారాల్లో కూడా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. అలాగే మానసిక ఒత్తిడి ప్రభావాన్ని తగ్గించేందుకు విటమిన్లు లభించే ఆహార పదార్థాలు తీసుకోవాలి. బి-కాంప్లెక్స్, విటమిన్ సి, జింక్ ఉండే ఆహారాలు ఎగ్జామ్స్ ప్రిపరేషన్‌లో ఉండే వారు తీసుకోవడంవల్ల ఒత్తిడి తగ్గుతుంది. అంతేగాక బాదం, తాజా కూరగాయలు, బ్రౌన్ రైస్, గుడ్లు, పండ్లు వంటి ఒత్తిడిని తగ్గించే ఆహారాలు తీసుకోవాలి.

Next Story

Most Viewed