ఉమెన్స్ డే స్పెషల్‌గా గిఫ్టింగ్ స్టోర్ ప్రారంభం.. భారీ ఆఫర్లు ప్రకటించిన అమెజాన్

by Disha Web Desk 9 |
ఉమెన్స్ డే స్పెషల్‌గా గిఫ్టింగ్ స్టోర్ ప్రారంభం.. భారీ ఆఫర్లు ప్రకటించిన అమెజాన్
X

దిశ, ఫీచర్స్: ‘‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుతారు. ఈ దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు. వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపును ఇస్తుంది. ఈ రోజు మహిళలందరికీ ప్రత్యేకమైన రోజు. సమాజంలో మహిళల పట్ల అవగాహన కల్పించేందుకు, మహిళలకు వారి హక్కులపై అవగాహన కల్పించేందుకు, మహిళలను ప్రోత్సహించేందుకు అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

అయితే ఈ క్రమంలో ఈ కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ గిఫ్టింగ్ స్టోర్ ను ప్రారంభించింది. కేవలం 199 నుంచే స్టార్టింగ్ ప్రైసెస్ ఉన్నాయి. మహిళలకు అవసరమయ్యే అనేక రకాల ఐటెమ్స్ ను అమెజాన్ అందుబాటులో ఉంచింది. కిరాణా, హ్యాంపర్లు, గౌర్మెట్ గిఫ్ట్స్, పర్సనల్ వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వంటగదికి సంబంధించినవి, ఫర్నిషింగ్, డెర్ వంటి విభాగాలలో ఉత్పత్లులను పెద్ద మొత్తంలో అందుబాటులో ఉన్నాయి. ఈ వస్తువులపై అదిరిపోయే ఆఫర్లను అమెజాన్ అందిస్తోంది.

టెలివిజన్, స్పీకర్లు, కెమెరాల వంటి ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీలపై 75% వరకు తగ్గింపు, రూ. 4,848 కే లైఫ్‌లాంగ్ వంటి బ్రాండ్‌ల నుంచి నొప్పి నివారణ కోసం ఫుట్ మసాజర్ మెషిన్, ఏసీలు, రిఫ్రిజిరేటర్ల వంటి పెద్ద ఉపకరణాలపై 65% వరకు తగ్గింపు, హీట్ బ్యాలెన్స్ టెక్నాలజీతో హావెల్స్ ఫోల్డబుల్ హెయిర్ డ్రైయర్‌ను రూ. 999, రూ. 2996 వద్ద కేరీన్‌హాన్స్ టెక్నాలజీతో ఫిలిప్స్ హెయిర్ స్ట్రెయిట్‌నర్ బ్రష్‌ను, అగారో నుంచి హెయిర్ కర్లర్‌ల కోసం రూ. 902 కంటే తక్కువ ధరలో అమెజాన్ అందిస్తోంది.

అలాగే ఫైర్ బోల్ట్ నింజా కాల్ ప్రో ప్లస్ స్మార్ట్ వాచ్ కేవలం రూ. 1199, సీఎస్-01 ప్లాస్టిక్ షేకర్ బాటిల్ రూ. 188, యాంటీ స్లిప్ ట్రూలీ రివర్సిబుల్ యోగా మ్యాట్ విత్ గైడ్‌అలైన్ ఫ్రమ్ టెగో రూ. 2,699, సిలికా జెల్ వెయిట్ లిఫ్టింగ్ స్ట్రాప్స్, రిస్ట్ ప్రొటెక్టర్ కోసం వెయిట్‌లిఫ్టింగ్, వర్కౌట్, క్రాస్‌ఫిట్ నుంచి హైక్స్ నుంచి ఆఫీస్ స్టైల్ రూ . 699, రాకర్జ్ బ్లూటూత్ నెక్‌బ్యాండ్ రూ. 999 కే వస్తున్నాయి. ల్యాప్ టాప్ లు, పోర్ట్ రోనిక్స్, బ్లూటూత్ స్పీకర్లు, పవర్ బ్యాంక్ లు వైర్ లెస్ మౌస్, హెడ్ ఫోన్స్, లాజిటెక్ హెచ్111 వైర్డ్ ఆన్ ఇయర్ హెడ్‌ఫోన్‌లు రూ. 745 వద్ద అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా.. వంటగదికి సంబంధించిన గృహోపకరణాలపై 70% వరకు తగ్గింపు లభిస్తోంది.



Next Story

Most Viewed