అంబలితో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ తీసుకుంటే ఎంత మంచిదో!

by Disha Web Desk 8 |
అంబలితో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ తీసుకుంటే ఎంత మంచిదో!
X

దిశ, ఫీచర్స్ : అంబలి చాలా మందికి తెలుసు. మన పెద్దవారు చెబుతుంటారు.. మేము జొన్న గడుక, అంబలి తాగి పెరిగాము అందుకే,డెభ్బై, ఎనభై వయసులో కూడా కొంత పని చేయగలుగుతున్నామని. ఎందుకంటే మనం రోజూ తినే చికెన్ మటన్, అన్నం కంటే అంబలి ఆరోగ్యానికి చాలా మంచిదంట. ఇందులో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. మరీ ముఖ్యంగా జొన్నలతో చేసే అంబలి తీసుకొవడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవంట.

జొన్న‌ల్లో క్యాల్షియం, ఐర‌న్, ఫాస్ఫ‌ర‌స్ వంటి వాటితో పాటు పీచు ప‌దార్థాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయి. జొన్న‌ల‌తో రొట్టలే కాకుండా అంబలిని కూడా త‌యారు చేసుకుని తాగ‌వ‌చ్చు. జొన్న అంబ‌లిని తాగ‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. జొన్న పిండితో అంబ‌లిని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ల‌భిస్తాయి.గుండె ఆరోగ్యంగా ప‌ని చేస్తుంది. షుగ‌ర్ స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. అంతేకాకుండా ఈ అంబ‌లిని తాగ‌డం వ‌ల్ల కండ‌రాలు ధృడంగా త‌యార‌వుతాయి.శ‌రీరంలో వేడి త‌గ్గుతుంది. అలాగే నీర‌సం, బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఎముక‌లు ధృడంగా తయార‌వుతాయి. రక్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. శ‌రీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తొల‌గిపోతుందంట. అందువలన వైద్యులు రోజులో ఒకసారైనా అంబలి తీసుకోవాలని చెబుతుంటారు.



Next Story

Most Viewed