ఆధార్ అప్ డేట్ చేయించాల్సిందే.. కొత్తగా వసూల్ చేసే చార్జీలు ఇవే..

by Dishafeatures3 |
ఆధార్ అప్ డేట్ చేయించాల్సిందే.. కొత్తగా వసూల్ చేసే చార్జీలు ఇవే..
X

దిశ, ఫీచర్స్ : ఆధార్ కార్డు అప్ డేట్ చేయించాలి అనుకుంటున్నారా? పేరు, అడ్రస్, ఫొటో చేంజ్ చేయాలని భావిస్తున్నారా? ఇందుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సి ఉంటుందో తెలుసుకోవాలని ఉందా? అయితే కంప్లీట్ డిటెయిల్స్ మీకోసమే..

డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, నేమ్.. ఇవి మార్చేందుకు యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. థంబ్ చేంజ్, ఐ స్కాన్ కోసం వంద రూపాయలు కాగా రెండు మార్చాలంటే రెండు రకాల చార్జీలు వసూల్ చేస్తారు. E-Aadhaar ప్రింటెడ్ వెర్షన్ కావాలంటే ముప్పై చెల్లిస్తే చాలు. అయితే ఫస్ట్ టైమ్ ఆధార్ నమోదు చేసుకునే వారి నుంచి ఎలాంటి ఫీజు వసూల్ ఉండదు. కానీ ప్రతీ పదేళ్లకు ఒక్కసారి మాత్రం అప్ డేట్ చేయించాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచించింది. ఇక ఐదు నుంచి పదిహేను ఏళ్ల మధ్య వయసున్న పిల్లల బయోమెట్రిక్ డీటెయిల్స్ అప్ డేట్ కూడా ఉచితమే.

ఇక ఆన్ లైన్ విషయానికి వస్తే.. అప్ డేట్ చేసుకోవడం టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. కానీ ఇందుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ అటాచ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఉచిత డాక్యుమెంట్ అప్ లోడ్ సదుపాయం జూన్ 14 వరకు మాత్రమే.



Next Story

Most Viewed