మంచి మగవాళ్లు మంచి భర్త ఎందుకు కాలేకపోతున్నారు? సర్వేలు ఏం చెబుతున్నాయి?

by Disha Web Desk 8 |
మంచి మగవాళ్లు మంచి భర్త ఎందుకు కాలేకపోతున్నారు? సర్వేలు ఏం చెబుతున్నాయి?
X

దిశ, ఫీచర్స్ : సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడి అయ్యాయి. ఎవరైనా సరే పెళ్లి సంబంధం చూస్తే మంచి వ్యక్తిని చూడండి అంటూ చెబుతారు. అంతే కాకుండా అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి పెళ్లి చేయాలి అంటారు కదా అని.. అబ్బాయి గుణగణాలు,పద్ధతులు, అలవాట్లు అని తెలుసుకున్నాక, తమ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు. అయితే న్యూ స్టడీలో ఇంట్రెస్టింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మంచి మగవాళ్లు మంచి భర్తలుగా ఉండటంలో ఫెయిల్ అవుతున్నారంట. అసలు దీనికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మంచి మగవాళ్ళు ఎక్కువగా అతి మంచితనానికి పోతారంట. వారు తన పార్ట్నర్ చేయాల్సిన పనులు కూడా వారే చేస్తామని చెప్పి చేయడం చేస్తారంట. ఇది తన భార్యకు కాస్త ఇబ్బంది కలిగిస్తుందని, దాని వల్ల వారు ఇబ్బందిగా ఫీల్ అవుతారు అంటున్నారు నిపుణులు. అంతే కాకుండా వారు ఎక్కువగా బయట వారిని సంతోషపెట్టడానికి ప్రయత్నించి ఇంట్లో తన భార్యను మర్చిపోతారు. ఆమెతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయలేరు. అంతే కాకుండా మంచి మగాళ్లు తమ బాధను, ఆనందాన్ని వారి కోణంలోనే చూస్తారంట. మ్యారేజ్ వల్లనే ప్రాబ్లమ్స్ అనుకుంటారు. దీని వలన వారు ఎమోషనల్‌గా హార్ట్ అవుతారు.

అదేవిధంగా భార్య భర్తల మధ్య గొడవలు రావడం వలన వారి బంధం మరింత బలంగా తయారు అవుతుంది. కానీ మంచి మగవాళ్లు అస్సలే గొడవలు రాకూడదు అనుకుంటారంట. నా వల్లే నువ్వు సంతోషంగా లేవని ఫీలై, భార్యతో ఇబ్బందులు ఎదుర్కొంటారు అంటున్నారు నిపుణులు. అలాగే వారి సొంత అవసరాలను, ఇష్టాలను బయట పెడితే అది అవతల వారికి శ్రమ అవుతుందని మంచి మగవాళ్లు భయపడతారు. అందరి సంతోషం గురించి ఆలోచించేవారు,వారి సొంత ఆనందాన్ని నెగ్లెక్ట్ చేసి ఫీలింగ్స్ ని లోపలే దాచి ఉంచుకుంటారు. ఇది వారి ఆరోగ్యానికే కాదు. మ్యారేజ్ లైఫ్ కి కూడా నష్టమే.



Next Story